తనీష్ హీరోగా ‘త్రీ మంకీస్’
యువ హీరో తనీష్ కథానాయకుడిగా వియంసి కంబైన్స్ అధినేత వి. దొరస్వామిరాజు ఓ యూత్ ఫుల్ మూవీని నిర్మించనున్నారు. ఉదయ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. 'త్రీ మంకీస్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...''మా సంస్థలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది, యువతరానికి నచ్చేలా దర్శకుడు కథ, కథనాలను సిద్దం చేశారు, ఈ నెల 19నుంచి చిత్రీకరణ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేస్తాం'' అని తెలిపారు.
ఈ చిత్రంలో ఇంకా కథానాయిక, ఇతర నటీనటుల ఎంపిక జరుగలేదని, ఈ సినిమా కోసం ఓ కొత్త హీరోయిన్ ను ఎంపిక చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. సాంకేతిక వర్గం వివరాలతో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాత స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











