twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియల్ హీరో అనిపించుకున్నాడు, ఎమోషనల్ అయిన తనీష్.. ఆమె కోసం ఏం చేశాడో తెలుసా!

    |

    తెలుగు బిగ్ బాస్ 2 సీజన్లో టైటిల్ గెలవక పోయినా హీరో తనీష్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. బిగ్ బాస్ లో తనీష్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తనీష్ తన పనిలో తాను బిజీ అయిపోయాడు. ఇటీవల తనీష్ చేసిన ఓ మంచి పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ లో ఉన్న సమయంలో తనీష్ పై చాలా వ్యతిరేకత ఉండేది. తాను ఎలాంటి వ్యక్తితో తనీష్ మరోమారు నిరూపించుకున్నాడు. ఓ చూపు లేని యువతికి తనీష్ చేసిన సాయం సాధారణమైనది కాదు.

     గొప్ప మనసు చాటుకున్నాడు

    గొప్ప మనసు చాటుకున్నాడు

    అంగవైకల్యం ఉన్న వారికి బదులుగా మరొకరు పరీక్ష రాసేందుకు అనుమతినిస్తారు. ఓ చూపు లేని యువతి కోసం పరీక్ష రాసేందుకు ముందుకు వచ్చిన తనీష్ రియల్ హీరో అనిపించుకున్నాడు. తనీష్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తాను పరీక్ష రాస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ యువతికి సాయం చేయడం చాలా సంతోషాన్నిచిందని తనీష్ తెలిపాడు.

    నేర్చుకోవడం ఆగకూడదు

    నేర్చుకోవడం ఆగకూడదు

    ఈ సందర్భంగా తనీష్ ఎమోషనల్ గా కొన్ని కామెంట్స్ చేశాడు. కొన్నిసార్లు మనం తీసుకునే మంచి నిర్ణయాల వలన కొన్ని నేర్చుకుంటాం. తప్పుడు నిర్ణయాలు కూడా మనకు కొన్ని నేర్పిస్తాయి. కానీ నేర్చుకోవడం మాత్రం ఆకూడదు అని తనీష్ తెలిపాడు. చదువుకుంటున్న సమయంలో సినిమా అవకాశాలు వచ్చాయి. దీనితో చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది అని అనీష్ తెలిపాడు.

    అది నేర్చుకున్నా

    నాగమణి అనే యువతి కోసం పరీక్ష రాశా. మనలో ఉన్న ఒక మైనస్ వలన జీవితంలో ఎదగకుండా ఆగిపోకూడదు అని నాగమణికి చేసిన సాయం వలన తెలుసుకున్నా అని తనీష్ తెలిపాడు. ఈ సాయం వలన నాకు తెలియని ఆనందం, సంతృప్తి కలిగిందని తనీష్ తెలిపాడు. తనీష్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    రంగు చిత్రంతో

    రంగు చిత్రంతో

    బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తనీష్ మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యాడు. ఇటీవల తనీష్ నటించిన రంగు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన్మథుడు, ప్రేమతో రా లాంటి చిత్రాలతో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న తనీష్ ఆ తర్వాత హీరోగా మారాడు. బిగ్ బాస్ 2 లో కౌశల్, గీత మాధురికి గట్టి పోటీ ఇచ్చింది తనిషే.

    English summary
    Tanish writes exam for visually challenged girl. Pic goes viral in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X