వంశీ...తాజా సినిమా వాల్ పేపర్లు వెరైటీగా (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : సీనియర్ దర్శకుడు వంశీ తాజాగా 'తను మొన్నే వెళ్లిపోయింది' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అజ్మల్, నిఖిత నారాయణ్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీయస్‌ పతాకంపై పూర్ణ నాయుడు నిర్మిస్తున్నారు. చక్రి ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు.

మొదటి నుంచి తన సినిమా పేర్ల విషయంలోనే కాదు, వాటి ప్రమోషన్లో కూడా కాస్త వెరైటీ ప్రదర్శించే వంశీ....'తను మొన్నే వెళ్లిపోయింది' సినిమాను కూడా వెరైటీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన వాల్ పేపర్లు విడుదలయ్యాయి.

ఇందులో కొన్ని వెరైటీగా ఉన్నా...మరికొన్ని మాత్రం అతి వెరైగా, మరికొన్ని సింపుల్‌గా ఉన్నాయి. వాటి గురించి మాటల్లో చెప్పడం కష్టం కానీ, స్లైడ్ షోలో వాటిని స్వయంగా మీరే చూసి మీ అభిప్రాయం ఏమిటో వెల్లడించండి. వరుస ప్లాపులతో ఉన్న వంశీ ఈ సినిమాతోనైనా మళ్లీ ఫామ్ లోకి వస్తారో? లేదో? చూడాలి.

ఇదో ప్రేమ కథా చిత్రమే!


ప్రమెషన్ కోసం వదిలిన వాల్ పోస్టర్లను చూస్తే...ఇదో ప్రేమ కథా చిత్రమని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఎడా పెడా లవ్ సింబల్స్ వాడేసారుగా!

వంశీ మార్కు కామెడీ ఉంటుందా?


వంశీ సినిమా అనగానే గోదావరి యాసతో కూడిన కామెడీ డైలాగులు....మామూలు సినిమాల కామెడీ విభిన్నంగా, ఇది వంశీ సినిమా అని గుర్తు పట్టేలా ఉంటాయి. మరి ఇందులోనూ అలాంటి సీన్లు ఉంటాయా?

వినసొంపైన పాటలు


వంశీ సినిమాలు ఓలా ఉన్నా...ఆయన సినిమాల పాటులు మాత్రం వినసొంపుగా, మనసుకు హత్తుకునేలా ఉంటాయి. మరి ఈ సినిమాలో చక్రి ఎలాంటి సంగీతం అదించబోతున్నారో చూడాలి.

గ్రామీణ నేపథ్యమేనా?


వంశీ సినిమాలు ఎక్కువగా గ్రామీణ నేపథ్యంలో సాగుతాయి. తాజాగా ఈ సినిమా వాల్ పోస్టర్లు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

విషాద ప్రేమ కథా?


ఈ పోస్టర్ చూస్తుంటే....ఈ సారి వంశీ సినిమాలో విషాద ప్రేమ కోణం ఉంటుందేమోననే భావన కలిగిస్తోంది.

హీరోయిన్ అందాలకు పెద్దపీట


వంశీ సినిమాల్లో హీరోయిన్ అందాలకు పెద్ద పీట ఉంటుంది. హీరోయిన్‌ను తెలుగుదనం ఉట్టిపడేలా ఎంతో చక్కగా చూపించే దర్శకుల్లో వంశీ ఒకరు.

హీరోను భిన్న కోణంలో చూపించబోతున్నాడా?


ఈ సారి వంశీ తన సినిమాకు అజ్మల్‌ను ఎంచుకోవడాన్ని బట్టి హీరోను భిన్నకోణంలో చూపిస్తాడని స్పష్టం అవుతోంది.

ప్రేమికుల కోపాలు తాపాలు


ఈ పోస్టర్ చూస్తుంటే ప్రేమికుల మధ్య ఉండే గిల్లిగజ్జాలు ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది.

వంశీ క్రియేటివిటీ వర్కౌట్ అయ్యేనా?


వంశీ తన దైన మార్కుకోసం సరికొత్తగా క్రియేటివిటీ చూపిస్తూ ఉంటారు. ‘తను మొన్నే వెళ్లి పోయింది' చిత్రంలో ఆయన క్రియేటివిటీ ఎలా ఉండబోతోందో?

హీరోయిన్‌కు ముసుగెందుకు వేసారబ్బా?


కొన్ని సార్లు క్రియేటివిటీ అతిగా అనిపిస్తుంది. ఇక్కడ హీరోయిన్‌ను ముసుగు వేసిన తీరు కూడా అలానే ఉంది కదూ...

హీరోగా నిలదొక్కుకుంటాడా?


ఇప్పటి వరకు విలన్ క్యారెక్టర్లు, ఇతర చిన్న పాత్రలు మాత్రమే చేసిన అజ్మల్ ఈచిత్రంతో తెలుగులో హీరోగా నిలదొక్కుకుంటాడో లేదో చూడాలి.

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు...


‘తను మొన్నే వెళ్లి పోయింది' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X