Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాధవన్ లేటెస్ట్ చిత్రం తెలుగు రీమేక్ కి దిల్ రాజు
మాధవన్, కంగనా రౌనత్ కాంబినేషన్ లో రూపొందిన హిందీ చిత్రం తను వెడ్స్ మనూ. క్రితం శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నల్లమలపు బుజ్జి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రీమేక్ రైట్స్ కోసం హిందీ నిర్మాతను సంప్రదించినట్లు తెలుస్తోంది.
అలా మొదలైంది విజయం సాధించటంతో అటువంటి రొమాంటిక్ కామిడీలకు గిరాకీ ఉంటుందనే ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కథ ఓ రొమాంటిక్ కామిడీలా సాగుతుంది. పెద్దలు కుదిర్చిన వివాహాలపై నమ్మకమున్న ఎన్నారై కార్డియాలజిస్టు మనుశర్మ (మాధవన్) అర్జెంటుగా ముడెట్టేసుకోవడం కోసం ఇండియాలో వాలిపోతాడు. దిగిందే తడువుగా కాన్పూర్ అమ్మాయి తనూజా త్రివేది (కంగనా)ని చూసేస్తాడు. పెళ్లిచూపుల్లో ఆమె ముఖం కూడా కనపడనీయకుండా ముసుగు వేసుకుని మరీ వస్తుంది. ఎంత అందం..ఎంత ముగ్ధమనోహరం..ఎంత సిగ్గరి అని మురిసిపోయేంతలో ఆమె పడిపోతుంది. ఏంటా అని కంగారుపడ్డ అతను ఆమె తాగి వుందని గమనిస్తాడు .
అయినా ఓ నవ్వు నవ్వుకుని సెల్ఫోన్లో ఓ ఫోటో కూడా తీసుకుని ఈమే నా భార్య అని ఫిక్స్ అయిన అతని మురిపెం ఎంతో సేపు సాగదు. ఆమె ఓ సిగరెట్ అంటించి వెంటనే పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోమని తనకో బాయ్ ఫ్రెండ్ (జిమ్మి షెరగల్) ఉన్నాడని చెప్తుంది. ఆ బాధతో వెళ్లిపోయిన అతనికి ఆమె మళ్లీ ఓ పంజాబీ వివాహంలో తారసపడుతుంది. ఆమెపై మనస్సు చంపుకోని మను ఆమెకోసం నానా తిప్పలు పడతాడు. అయినా ఆమె అతన్ని లెక్క చేయక ఆపెళ్లిలో తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పిచ్చి పిచ్చి డాన్సులు చేసి విచిత్రంగా విచ్చలవిడిగా బిహేవ్ చేస్తుంది. అయితే ఈసారి మన హీరోని అడ్డం పెట్టుకుని తన బాయ్‌ఫ్రెండ్‌తో జంప్ అయిపోవాలని ప్లాన్ వేస్తుంది.
అప్పుడు మనవాడు కూడా నమస్తే లండన్ వంటి సినిమాలు చూసి వుండడంతో తనే ఈ కథకు హీరోని అని అర్ధం చేసుకుని తన బాధను తన చిరునవ్వు చాటున దాచేసి వారిద్దరిని కలిపి అక్షింతలు వేయడానికి రెడీ అయిపోతాడు. ఆ క్రమంలో ఏం జరిగింది? వీరిద్దరు ఒకటయ్యారా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.లేదా తెలుగులో వచ్చేవరకూ ఆగాల్సిందే