సైలెంట్ గా పెళ్లికి సిద్దమౌతున్నకమేడియన్ సునీల్...!
'కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు" ఇచ్చిన షాక్ తో సైలెంట్ అయిన సునీల్ ఈ గ్యాప్ లో కమెడియన్ క్యారెక్టర్స్ కూడ పెద్దగా చేయలేదు. 'మర్యాద రామన్న" ఇచ్చిన బ్రేక్ ని దుర్వినియోగం చేసుకున్నందుకు ఫీలవుతున్న సునీల్ తాను హీరోగా నటించే తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు. అందుకే ఎన్నో తర్జనభర్జనల తర్వాత పూలరంగడు సినిమా నటించడానికి అంగీకరించాడు.
అలాగే హిందీ చిత్రం'తను వెడ్స్ మను" రీమెక్ లోనూ నటించేందుకు సిద్దమవుతున్నాడు. హిందీలో హిట్ అయిన ఈ చిత్రంలో అక్కడ మాధవన్, కంగనా రౌనత్ నటించారు. సునీల్ తో అందాల రాముడు నిర్మించిన మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తోంది. ఆడుతూ పాడుతూ, లీలామహాల్ సెంటర్ చిత్రాలకి దర్శకత్వం వహించిన దేవీప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నా కానీ ఇంతవరకు ఈ పెళ్లి మేటర్ ని మీడియాకి చెప్పకుండా దాచి పెట్టారు. బహుశా హీరోయిన్ ని నిర్ణయించిన తర్వాత ఒకేసారి గ్రాండ్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నది..


Click it and Unblock the Notifications











