రెండేళ్ల తరువాత ఇండియాకు శృంగార తార.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య హీరోయిన్!
Recommended Video

సాధారణంగా హీరోయిన్లు ఎంత ఏజ్ వచ్చినా పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తుంటారు. ఫిజిక్ పై దృష్టి పెట్టని హీరోయిన్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తాజగా ఓ భామ రెండేళ్ల తరువాత యుఎస్ నుంచి ముంబైలో అడుగు పెట్టి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ లుక్ లో ఆ హీరోయిన్ చూసి ఎవరో గుర్తు పట్టడడం చాలా కష్టం. బాలీవుడ్ శృంగార తార తనుశ్రీ దత్త గురించే ఇదంతా.

శృంగార తారగా
ఇమ్రాన్ హష్మీ చిత్రం ఆషిక్ బనాయా అపనే చిత్రంలో శృంగార తారగా తనుశ్రీ దత్త కుర్రాళ్లని ఉడుకెత్తించింది. మరికొన్ని బాలీవుడ్ చిత్రాలలో సైతం తనుశ్రీ దత్త నటించి మెప్పించింది. ఆసినిమాల్లో నటిస్తున్న సమయంలో తనుశ్రీ దత్తా అందానికే అందం అన్నట్లుగా గ్లామర్ లుక్ లో కనిపించేది.

తెలుగులోనూ
తనుశ్రీ దత్తా తెలుగు వారి సుపరిచితురాలే. బాలయ్య నటించిన వీరభద్ర చిత్రంలో ఈ భామ అందాలు ఒలకబోసింది. ఆ చిత్రం పెద్దగా విజయం సాధించకపోవడంతో తనుశ్రీకి తెలుగులో ఆ తరువాత అవకాశాలు రాలేదు.

గుర్తుపట్టలేనంతగా
తనుశ్రీ దత్త దాదాపు రెండేళ్ల తరువాత యుఎస్ నుంచి ఇండియాకు వచ్చింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఆషిక్ బనాయా అపనే చిత్రంలో నటించినతనుశ్రీ నేనా చూస్తున్నది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

బొద్దుగా మారిపోయింది
2010 వరకు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన తనుశ్రీ దత్త ఆ తరువాత చిత్రాలకు దూరమైంది. ఇటీవల అమెరికాలో సెటిల్ అయింది. రెండేళ్ళ తరువాత తిరిగి ఇండియా రావడంతో బాగా బొద్దుగా మారినట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











