గుండు గీయించుకున్న బాలయ్య హీరోయిన్
అలాగే నేను చాన్నాళ్ళు పుణ్యక్షేత్రాలు తిరిగాను. హిమాలయాలకు కూడా వెళ్ళాను. కానీ నాకు ఇంకా ఏదో లోటుగానే అనిపించింది. అందుకే గుండు గీయించుకున్నాను. ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పిందీ తనుశ్రీ దత్తా. ఇక వీరి బాటలో భవిష్యత్తుల్లో ఇంకెంతమంది హీరోయిన్స్ పయనిస్తారో చూడాలంటోంది బాలీవుడ్ మీడియా.
ఇక ఆమెకు హీరోయిన్స్ అందంపైనే నెగ్గుకొస్తారని నమ్మకం. ఈ విషయమై మాట్లాడుతూ... కేవలం నటనతోనే హీరోయిన్స్ రాణిస్తారంటే నేనొప్పుకోను. ఇప్పుడున్న పోటీలో నెగ్గుకురావడం చాలా కష్టం. అందాల్ని ప్రదర్శించడానికే హీరోయిన్స్ పాత్రల్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకనిర్మాతలు. అందుకే ఆ అందాన్ని సహజసిద్ధంగా కాపాడుకోవడానికి నేను ప్రాధాన్యతనిస్తాను అంటోంది తనుశ్రీ దత్తా.
అలాగే తాను అందాన్ని కాపాడుకోవటానికి ఎలాంటి పద్ధతుల్ని పాటిస్తోందో తనుశ్రీ దత్తా వివరిస్తోంది. ఆమె మాటల్లోనే... 'రోజూ యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. దీని వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. వ్యాయామాల విషయానికొస్తే..రోజూ రెండు గంటలు క్రమం తప్పకుండా జిమ్ లో గడుపుతున్నాను. తిండి విషయంలో ప్రత్యేకమైన మెనూ ఉంది. ఎక్కువ ఆయిల్‌తో చేసిన ఆహారపదార్థాలకు బదులు పచ్చి కూరగాయలు.. రకరకాల పండ్లు తీసుకుంటున్నాను. నీరు బాగా తాగుతున్నాను. ఇవే నా బ్యూటీ సీక్రెట్స్ అని వివరించింది.


Click it and Unblock the Notifications












