twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండు గీయించుకున్న బాలయ్య హీరోయిన్

    By Srikanya
    |

    హైదరాబాద్: అప్పట్లో బాలకృష్ణ సరసన వీరభద్ర చిత్రంలో హీరోయిన్ గా చేసిన తనుశ్రీ దత్తా గుర్తుండే ఉంటుంది. హిందీలో అడపాదడపా ఆఫర్స్ పట్టుకుంటున్న ఆమె రీసెంట్ గా గుండు గీయించుకుంది. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ.."పదేళ్ళు సినిమా రంగంలో ఉన్నాను. ఎన్నెన్నో ఒత్తిడులు, నిత్యం షూటింగ్‌లు, సెట్‌లో లైట్లు.. మరెన్నో కారణాల వల్ల నేను విసిగిపోయాను.అందుకే గుండు గీయించుకున్నాను అంది.

    అలాగే నేను చాన్నాళ్ళు పుణ్యక్షేత్రాలు తిరిగాను. హిమాలయాలకు కూడా వెళ్ళాను. కానీ నాకు ఇంకా ఏదో లోటుగానే అనిపించింది. అందుకే గుండు గీయించుకున్నాను. ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పిందీ తనుశ్రీ దత్తా. ఇక వీరి బాటలో భవిష్యత్తుల్లో ఇంకెంతమంది హీరోయిన్స్ పయనిస్తారో చూడాలంటోంది బాలీవుడ్ మీడియా.

    ఇక ఆమెకు హీరోయిన్స్ అందంపైనే నెగ్గుకొస్తారని నమ్మకం. ఈ విషయమై మాట్లాడుతూ... కేవలం నటనతోనే హీరోయిన్స్ రాణిస్తారంటే నేనొప్పుకోను. ఇప్పుడున్న పోటీలో నెగ్గుకురావడం చాలా కష్టం. అందాల్ని ప్రదర్శించడానికే హీరోయిన్స్ పాత్రల్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకనిర్మాతలు. అందుకే ఆ అందాన్ని సహజసిద్ధంగా కాపాడుకోవడానికి నేను ప్రాధాన్యతనిస్తాను అంటోంది తనుశ్రీ దత్తా.

    అలాగే తాను అందాన్ని కాపాడుకోవటానికి ఎలాంటి పద్ధతుల్ని పాటిస్తోందో తనుశ్రీ దత్తా వివరిస్తోంది. ఆమె మాటల్లోనే... 'రోజూ యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. దీని వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. వ్యాయామాల విషయానికొస్తే..రోజూ రెండు గంటలు క్రమం తప్పకుండా జిమ్‌ లో గడుపుతున్నాను. తిండి విషయంలో ప్రత్యేకమైన మెనూ ఉంది. ఎక్కువ ఆయిల్‌తో చేసిన ఆహారపదార్థాలకు బదులు పచ్చి కూరగాయలు.. రకరకాల పండ్లు తీసుకుంటున్నాను. నీరు బాగా తాగుతున్నాను. ఇవే నా బ్యూటీ సీక్రెట్స్ అని వివరించింది.

    English summary
    Bollywood siren Tanushree Dutta having shaved her head and turning into a sanyasi by giving up her filmy career.Tanushree also expressed a desire to go bald and take up spiritualism. “To take a break from pressure, ruthless people, heartbreak and heartburns, I’ve taken this decision. This will also hide my identity while traveling in public and help me remain incognito,” she is said to have remarked.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X