twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసమర్థురాలు, దద్దమ్మ... హీరోయిన్ మీద డాన్స్ మాస్టర్ సంచలన కామెంట్స్!

    |

    బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పాటకర్ మీద చేసిన #మీటూ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో పాటు ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం మరింత ఉధృతం కావడానికి దోహద పడింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తనను సెక్సువల్‌గా వేధించాడని ఆరోపించడంతో పాటు, ఈ వేధింపుల పర్వంలో డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య, డైరెక్టర్ రాకేష్ సారంగ్, నిర్మాత సమీ సిద్ధిఖీల పాత్ర కూడా ఉందని తనుశ్రీ తన కంప్లయింట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

    గొడవలోకి వాళ్లను లాగొద్దు, కావాలంటే క్షమాపణలు చెబుతాను!గొడవలోకి వాళ్లను లాగొద్దు, కావాలంటే క్షమాపణలు చెబుతాను!

    ఈ నేపథ్యంలో తాజాగా గణేష్ ఆచార్య తనుశ్రీ మీద మండి పడ్డారు. ఆమె తన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి, షూటింగ్ సమయంలో తన అసమర్దతను సమర్థించుకోవడానికే మీటూ ఉద్యమాన్ని వాడుకుంటోందని ఫైర్ అయ్యారు.

    ఆ సమయంలో సెట్లో దాదాపు 100 మంది డాన్సర్లు ఉన్నారు

    ఆ సమయంలో సెట్లో దాదాపు 100 మంది డాన్సర్లు ఉన్నారు

    తనుశ్రీ దత్తా ఆరోపిస్తున్న దాంట్లో నిజం లేదు. అది సోలో డాన్స్ పెర్ఫార్మెన్స్ కాదు. ఇది వెల్ ప్లాన్డ్ గ్రూప్ డాన్స్... బ్యాగ్రౌండ్లో దాదాపు 100 మంది డాన్సర్లు పాల్గొన్నారు. షూట్‌కు ముందే మార్చి 17 నుంచి 20, 2018 వరకు నా పర్యవేక్షణలో రిహార్సల్ కూడా జరిగింది.... అని గణేష్ ఆచార్య గుర్తు చేసుకున్నారు.

    తనుశ్రీ దత్తా ప్రవర్తనతో ఇబ్బంది పడ్డాం

    తనుశ్రీ దత్తా ప్రవర్తనతో ఇబ్బంది పడ్డాం

    రిహార్సల్ సమయంలోనే అసిస్టెంట్ డాన్సర్లు ఎలాంటి స్టెప్స్ ఉంటాయో తనుశ్రీ దత్తాకు నేర్పడం జరిగింది. ఆ సమయంలో తనుశ్రీ దత్తా ప్రవర్తనతో నేను, నా టీమ్ చాలా ఇబ్బంది పడ్డాం. రిహార్సల్ సమయంలో నానా పాటేకర్ విషయంలో ఆమె నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలులేదన్నారు.

    వల్గర్ డాన్స్ స్టెప్స్ కూడా లేవు

    వల్గర్ డాన్స్ స్టెప్స్ కూడా లేవు

    ఆ రోజు షూటింగులో ఎలాంటి వల్గర్ డాన్స్ మూమెంట్స్ కూడా లేవు. స్టెప్స్ అన్నీ నేను, నా అసిస్టెంట్ డాన్సర్లు ఆల్రెడీ కొయోగ్రఫీ చేసి, ప్రాక్టీస్ చేసి, ఫైనలైజ్ చేసినవే.... అన్నారు గణేష్ ఆచార్య.

    ఆమె అసమర్థురాలు, పని చేతకాని దద్దమ్మ

    ఆమె అసమర్థురాలు, పని చేతకాని దద్దమ్మ

    షూటింగ్ సమయం వచ్చే సరికి తనుశ్రీ దత్తా వెళ్లి వానిటీ వ్యాన్లో కూర్చుంది. మేమంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నామనే విషయం కూడా పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టింది. ఆలస్యంగా షూట్‌కు వచ్చింది. ప్రాక్టీస్ చేసిన స్టెప్పులు సరిగా ప్రదర్శించకుండా తన అసమర్దతను చాటుకుంది. ఒకరకంగా ఆమె పని చేతకాని దద్దమ్మ అంటూ గణేష్ ఆచార్య మండి పడ్డారు.

    English summary
    Tanushree Dutta filed a lawsuit against Nana Patekar for sexually harassing her on the sets of Horn OK Please in 2008 and also named choreographer Ganesh Acharya, director Rakesh Sarang and producer Samee Siddiqui in the complaint saying that they too played a role in the harassment and the investigation is still going on. Not letting things go lightly, Ganesh Acharya lashed out against Tanushree Dutta and said that she's using the MeToo movement to hide her faults, as she failed to deliver the desired outcome during the shoot of Horn OK Please.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X