తాప్సీకి మొగుడు అవుతున్న గోపీచంద్

By Srikanya

'ఝుమ్మంది నాదం'తో పరిచయమైన తాప్సి త్వరలో గోపీచంద్‌తో జతకట్టబోతోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న మొగుడు చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా చిత్రీకరణ మొదలైంది.ఆది,లక్ష్యం, లక్ష్మి వంటి హిట్ చిత్రాలును అందించిన నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) ఈ చిత్ర నిర్మాత.

త్వరలోనే స్క్రిప్టు పనులు ఫినిష్ చేసి హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్ ప్రారంబిస్తారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా భారతీయ వివాహ వ్యవస్ధపై గౌరవం పెంచే విధంగా వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపుదిద్దుకొంటుందని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ని గోపిచంద్ కి తండ్రిగా తీసుకుంటున్నారు. కల్యాణి మాలిక్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: భవ్య, ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ నరోజ్‌, మాటలు: లక్ష్మీభూపాల్‌, పాటలు: సీతారామశాస్త్రి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X