గతంలో సునీల్ ప్రక్కన చేయటానికి ఆసక్తి చూపని హీరోయిన్స్ అంతా ఇప్పుడు సునీల్ తో చేయటానికి ముందు వరసలో నిలబడుతున్నారు. త్వరలో సునీల్,తాప్సీ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. సునీల్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న చిత్రంలో ఆమెను ఎంపిక చేసారని తెలుస్తోంది. గతంలో కలిసుందాం రా వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు ఉదయ్‌శంకర్ డైరక్షన్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఉదయ్ శంకర్ దర్సకత్వంలో రూపొందే ఆ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. గతంలో కలిసుందాం రా, రారాజు వంటి చిత్రాలు చేసిన ఉదయ్ శంకర్ చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రం చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రెండేళ్ల క్రితమే వెంకటేష్ తో చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే పూర్తి కామెడీకి వెంకటేష్ ఓకే చేయకపోవటంతో అప్పుడు ఆగింది. ఇప్పుడు సునీల్ తో పట్టాలు ఎక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రనికి సంభందించి స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించి అఫీషియల్ ప్రకటన వస్తుంది. ఇక మరో ప్రక్క సునీల్...తను వెడ్స్ మను రీమేక్ లో చేస్తున్నారు. దేవి ప్రసాద్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. దానితో పాటు లారెన్స్ దర్శకత్వంలో ఓ చిత్రం సైతం కమిటయ్యినట్లు సమాచారం. అలాగే నాగచైతన్య, సునీల్ కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని రూపొందించటానికి బెల్లంకొండ సురేష్ ప్రయత్నిస్తున్నాడని చెప్తున్నారు.