ఆ సినిమాకు 100 కోట్లు వస్తే షాక్ తిన్నాం.. తాప్సీ పొన్ను
గ్లామర్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చిన తాప్సీ పొన్ను రూటు మార్చింది. తాజాగా సోలో హీరోయిన్‌గా అవతారం ఎత్తి విజయాలను అందుకొన్నది. నామ్ షాబానా, సూర్మా, పింక్, బద్లా సినిమాలు ఆమెను అగ్రతారగా నిలబెట్టాయి. తాజాగా తాప్సీ పొన్ను నటించిన గేమ్ ఓవర్ సినిమా జూన్ 14న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. బద్లా సినిమా భారీగా వసూళ్లు రాబట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాప్సీ ఏమన్నారంటే..
నేను నటించిన బద్లా సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం చాలా ఆశ్చర్యం వేసింది. 30 లేదా 40 కోట్లు వస్తే హ్యాపీ అని నేను, అమితాబ్ సర్ అనుకొన్నాం. కానీ బద్లా సినిమాకు క్రిటిక్స్ ప్రశంసలు రావడమే కాకుండా వసూళ్లు కూడా భారీగా రావడం హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా కలెక్షన్లు వంద కోట్లు దాటేసినప్పటుడు అమితాబ్, షారుక్ ఖాన్ మధ్య పార్టీ గురించి ట్వీట్లు సోషల్ మీడియాలో రచ్చ చేసాయి. అయితే ఆ సమయంలో నేను యూపీలో షూటింగ్ చేస్తున్నాను. అప్పుడు నేను వచ్చే వరకు పార్టీ గురించి ఆలోచించకూడదని చెప్పాను. కానీ నేను మాత్రం యూపీ షూటింగ్‌లో పండుగ చేసుకొన్నాను. ఇప్పుడు నాపై అంచనాలు పెరిగాయి. నా తదుపరి సినిమా 100 కోట్ల చేరుతుందా అనే టెన్షన్ మొదలైంది.

అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం రెండుసార్లు రావడం హ్యాపీగా ఉంది. మొదటి సినిమా సమయంలో తొలి షెడ్యూల్ అప్పుడు కొంచెం ఒత్తిడిగా ఫీలయ్యాను. ఆ తర్వాత పరిస్థితి నార్మల్‌గా అనిపించింది. రెండో సినిమా సమయంలో నేను బిగ్ బీతో నటిస్తున్నాననే ఫీలింగ్ కలుగలేదు. ఏదో అభిషేక్‌తో కలిసి నటిస్తున్నానే ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు మా ఇద్దరికి ఓ టెన్షన్ మొదలైంది. ఒకవేళ ఇద్దరం కలిసి నటిస్తే హ్యాట్రిక్ కొట్టాల్సిందనే భయం వెంటాడుతున్నది. పింక్ సినిమా సౌత్ ఇండియాలో రీమేక్ కావడం చాలా హ్యాపీగా ఉంది. బాలీవుడ్ సినిమాలు కూడా దక్షిణాదిలా రావాలి. పింక్ సినిమా రీమేక్ కోసం నన్ను అడుగలేదు. అలా అడుగకపోవడం నాకు మంచిదే అనిపించింది. ఎందుకంటే మళ్లీ ఆ పాత్రను చేయడం చాలా భావోద్వేగం కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications











