రిచాని కాదని తాప్సీ వెనక పడ్డ వెంకటేష్‌

By Srikanya

తాప్సీ తొలిసారిగా వెంకటేష్ సరసన నటించటానికి ఎంపికైంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వెంకటేష్‌ నటించనున్న చిత్రం కోసం ఆమెను ఎంపిక చేసారు. మొదట ఈ పాత్ర కోసం రిచా గంగోపాధ్యాయని ఎంపిక చేసారు. కానీ ఆ తర్వాత ఆమెను కాదనుకుని తాప్సీని సీన్ లోకి తీసుకొచ్చారు. సింహా నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రంలో ఈ చిత్రంలో శ్రీకాంత్ సైతం కీ రోల్ చేస్తున్నాడు. శ్రీకాంత్ సరసన మధురిమ చేస్తోంది. మరో హీరోయిన్ ని సైతం ఈ చిత్రం కోసం వెతుకుతున్నారు. ఈ చిత్రం ఈ రోజు (బుధవారం) హైదరాబాద్ లో లాంఛనంగా మొదలవుతుంది. కోన వెంకట్‌, గోపీ మోహన్‌ కథను సమకూర్చిన ఈ చిత్రంలో యాక్షన్‌, కామిడీ కలసి అలరిస్తాయని చెప్తున్నారు. ఈ చిత్రానికి షాడో అనే టైటిల్ ని పెట్టే అవకాశం ఉంది.

ఇక ప్రస్తుతం తాప్సి డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో ఓ హిందీ చిత్రం చేస్తోంది. అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న గుండెల్లో గోదారి చిత్రంలోనూ ఆమే హీరోయిన్ గా చేస్తోంది. గోపీచంద్ తో చేసిన మొగుడు చిత్రం ఆమెకు హిట్ ఇవ్వకపోయినా పెద్ద హీరోల కళ్ళలో పడేలా చేసింది. ఈ చిత్రంతో ఆమె తాను మిగతా స్టార్ హీరోల సరసన కూడా ఆఫర్స్ వస్తాయని భావిస్తోంది. వెంకటేష్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక మెహర్ రమేష్ తన శక్తి ఫ్లాఫ్ తర్వాత చేస్తున్న చిత్రం ఇది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X