పండగ చేసుకుంటున్న తాప్సి
దసరాకు ముందే హీరోయిన్ తాప్సి పండుగ ఆనందంతో ఉంది. కారణం ఆమె మెయిన్ హీరోయిన్ గా నటించిన వచ్చాడు-గెలిచాడు, మెగుడు సినిమాలు దసర సందర్బంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు మంచి హిట్టయితే అగ్రహీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోవచ్చని ఉవ్విల్లూరుతోంది ఈ ఢిల్లీ భామ.
వచ్చాడు గెలిచాడు సినిమాలో హీరో జీవా సరసన తాప్సి ఆర్కిటెక్ట్ రోల్ చేస్తోంది. ఇందులో తాప్సి గతంలో కంటే స్లిమ్ గా, క్యూట్ గా కనిపించబోతోందట. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ఇందులో తన పాత్ర విభిన్నంగా ఉంటుంది, పాత్రకు తగిన విధంగా నా రూపం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చింది.
మరో వైపు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రాబోతున్న 'మొగుడు" సినిమాపై తాప్సి బోలెడు ఆశలు పెట్టుకుంది. గతంలో ఎంతో మంది హీరోయిన్లకు మంచి బ్రేక్ ఇచ్చిన కృష్ణ వంశీ తనకు మంచి లైఫ్ ఇస్తాడనే నమ్మకంతో ఉంది. ఇందులో గోపీచంద్ హీరోగా చేస్తుండగా తాప్సి క్లాసికల్ డాన్సర్‌గా చేస్తోంది. మరి ఈ దసరా పండుగ తాప్సి కెరీర్ లో వెలుగు నింపుతుందో? లేదో? చూడాలి.


Click it and Unblock the Notifications











