హాలీవుడ్ ఆఫర్ అని వెళితే..తాప్సీకి...
అమ్మడికి ఇటీవల ఓ హాలీవుడ్ చిత్రం నుంచి పిలుపు వచ్చిందట. నటిగా తన స్థాయి పెరుగుతుందని భావించి వెంటనే సరేనందట. తీరా చూస్తే డబ్బింగ్ ఆర్టిస్టుగా అవసరమని చెప్పారట.అసలు విషయం ఏమిటని ఆరా తీస్తే.. 'రిడ్డిక్' అనే ఆంగ్ల చిత్రాన్ని భారతీయ భాషల్లోని హిందీ, తమిళం, తెలుగులోనూ విడుదల చేయనున్నారు. హిందీ వెర్షన్‌కు సంబంధించి హీరోయిన్ పాత్రకు గొంతు అందించాలని తాప్సీని కోరారట. ఏదో ఒకటి హాలీవుడ్ సినిమాకు పని చేయటమే అదృష్టమంటూ డబ్బింగ్ చెప్పే యోచనలోనే ఉందట.
ఇక ఇప్పుడిప్పుడే సాహసం ఫరవాలేదనిపించుకోవటంతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్న తాప్సీకి మరో వైపు నుంచి అంజలి ట్విస్ట్ ఇచ్చింది. లారెన్స్ ని కలిసిన అంజలి...ఆయన తాజా చిత్రంలో మెయిన్ హీరోయిన్ వేషం పట్టేసి...అప్పటికే ఎంపికైన తాప్సీకి నీరసం తెప్పించింది. ఇటీవల పిన్నితో చోటుచేసుకున్న మనస్పర్థలను సర్దుబాటు చేసుకున్న అంజలి అదే క్రమంలో కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. 'ముని', 'కాంచన'లకు కొనసాగింపుగా రాఘవా లారెన్స్ 'గంగా' పేరిట సినిమా తెరకెక్కిస్తున్నాడు.
హీరోయిన్ పాత్రకు అంజలిని ఎంపిక చేశారని, ఇందుకు ఆమె కూడా అంగీకరించిందని సమాచారం. మరోవైపు ఈ సినిమాలో ఇప్పటికే కీలకపాత్రకు ఎంపికైన తాప్సీ.. అంజలి రాకతో తన పాత్ర ప్రాధాన్యం తగ్గిస్తారేమోనని ఆందోళనలో ఉందట. ఈ విషయమై కోలీవుడ్ వర్గాలు,మీడియా ప్రచారం మొదలెట్టాయి. లారెన్స్ మొదటి తాప్సీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడని,అంజలి ఎంట్రీతో ఆమెను పట్టించుకోవటం మానేసాడని అంటున్నాయి.


Click it and Unblock the Notifications












