twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నేను తాప్సీని కాదు' అనే దాకా వదలేదు

    By Srikanya
    |

    ఒకేసారి అంతమంది చుట్టుముట్టి 'మీరు తాప్సీయే కదా?'అని అడగడంతో భయం వేసింది. నాతో పాటు నా మేకప్ ఆర్టిస్ట్, నా అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. వాళ్లు, నేను కలిసి 'నేను తాప్సీ కాదు' అని వారిని నమ్మించడానికి నానా పాట్లు పడ్డాం అంటోంది తాప్సీ. డిసెంబరు 31న రోడ్డు మీద జరిగిన ఓ సంఘటన గురించి వివరిస్తూ..అలాగే...గత నెల చివరి రోజున బదామీ నుంచి హైదరాబాద్‌కి కారులో వస్తున్నాను. మార్గమధ్యంలో ఓ గ్రామం దగ్గర కారు హఠాత్తుగా ఆగిపోయింది. అక్కడ వీధి లైట్లు కూడా లేవు. మెకానిక్ షెడ్ లేదు. ఏం చెయ్యాలో దిక్కు తోచక చూస్తున్న సమయంలో ఒక 50మంది మా కారుని చుట్టుముట్టేశారు.

    వారు తాప్సీ అని అడుగుతూ ముందుకు వస్తున్నారు. నేను తాప్సీ అంటే వాళ్లేదో చేస్తారని కాదు.. ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లంటూ ఒత్తిడి చేస్తారేమోనని, ఆ రభసకు ఇంకొంతమంది గుమిగూడిపోతారని భయపడ్డాను. అందుకని 'నేను.. నేను కాదు. వేరే అమ్మాయిని' అని చెప్పుకోవాల్సి వచ్చింది. బహుశా ఇలాంటి విచిత్ర పరిస్థితి ఎవరికీ ఎదురు కాదేమో. ఈ ఇబ్బందికర పరిస్థితిల్లోంచి బయటపడేస్తూ.. మా కారు వర్క్ ఫినిష్ అయ్యింది. దాంతో ఉషారుగా హైదరాబాద్ వచ్చేశాం అంది తాప్సీ. ప్రస్తుతం ఆమె లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న 'గుండెల్లో గోదారి' చిత్రంలో పల్లెటూరి యువతి సరళ పాత్రను పోషిస్తోంది. లంగా, ఓణీ, రెండు జడలు, కళ్లకు కాటుక... ఇలా అసలు సిసలు పల్లె పడచులా ఆమె కనపడనుంది.

    English summary
    Tapsi spent some tense moments near a village on the Andhra Pradesh, Karnataka border.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X