తాప్సీ అంత ఫీలయ్యే తప్పేం చేసింది
సినిమాల్లోకి రాకముందు ఈ పరిశ్రమ గురించి రకరకాల మాటలు విన్నాను. వాటిల్లో కొన్ని నిజాలున్నాయి. కొన్ని అబద్ధాలున్నాయి. ఇక్కడ ఎవరూ ఎవరినీ బలవంతం చేయరు. అన్నీ మన నిర్ణయాల ప్రకారమే జరిగిపోతాయి. మన కర్మకు మనమే బాధ్యులం. మరొకరిని నిందించలేం అంటోంది తాప్సీ. ఇది విన్న వారంతా తాప్సీని ఎవరన్నా ఏదన్నా చేసారా..కెరీర్ కోసం తప్పని సరి పరిస్దితుల్లో ఏ నిర్ణయం తీసుకుందో అంటున్నారు. అలాగే ఆమె ఇష్టమైన చదువుని మధ్యలో వదిలేసి ఈ రంగానికి వచ్చా. సినిమాలపై ప్రేమ పెంచుకొన్నా. అందుకే మంచి, చెడు రెండింటినీ ఆస్వాదిస్తున్నా అనటం కూడా అందరినీ ఆలోచనలో పడేసింది. ప్రస్తుతం ఆమె గోపీచంద్ సరసన 'మొగుడు' చిత్రంలో చేస్తోంది.
ఆమె పాత్ర గురించి చెప్తూ..ఇందులో నేను కూచిపూడి కళాకారిణిగా కనిపిస్తా. కృష్ణవంశీ సార్.. నన్ను, నా పాత్రనీ చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు. సినిమా చూస్తుంటే ఓ కుటుంబంతో కలిసి ప్రయాణం చేస్తున్నట్టే ఉంటుంది అంది. అలాగే ఆమె మరో చిత్రం 'వచ్చాడు గెలిచాడు'లో తాప్సి పాత్ర గురించి చెబుతూ...ఇంద్రలోకం నుంచి దిగివచ్చిన అమ్మాయిగా మాత్రం కాదు. నిజజీవితంలో మీకు కనిపించే అమ్మాయిలా కనిపిస్తాను. కోటీశ్వరుల బిడ్డని. అంత మాత్రాన ఆ గర్వం చూపించను. చాలా సాదాసీదాగా ప్రవర్తిస్తాను. నేను ఖర్చుపెట్టే ప్రతీ రూపాయి నేనే సంపాదించాలి అనుకొనే అమ్మాయిని. ఈ లక్షణాలు నచ్చే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాను అంది.


Click it and Unblock the Notifications











