మంచు లక్ష్మి గురించి వివరించిన తాప్సీ
అలాగే... సినిమా... చిన్నప్పట్నుంచీ కలగని వచ్చిన ఫీల్డ్ కాదు. అడుగుపెట్టాక మాత్రం బాగా చేయాలని వందశాతం కమిటెడ్‌గా ఉన్నా. ఈ రంగంలో నాకు మొదట్నుంచీ అండగా ఉండి, ఓనమాలు నేర్పింది మంచు లక్ష్మి అనే చెబుతా. ఇక్కడికి వచ్చేముందు నేను చాలా సాధారణ అమ్మాయిలా ఉండేదాన్ని. అబ్బాయిలకు నప్పే జీన్స్, టీ షర్టులు వేసుకునేదాన్ని. ఒకవిధంగా నాలో అసలు కళ ఉండేది కాదు. దాంతో హీరోయిన్‌కి ఉండాల్సిన ప్రత్యేకతలు నాలో కనిపించేవి కావు అంది.
మంచు లక్ష్మితో తన సాన్నిహిత్యం గురించి చెప్తూ... లక్ష్మి దుస్తుల ఎంపిక, మాటతీరు, నటనకు సంబంధించిన విషయాలను నాకు చెబుతూ వచ్చింది. 'నిన్ను రాష్ట్రమంతా తెరమీద చూస్తుంది. కాబట్టి నీకు సూటయ్యే మంచి డ్రెస్సులు ఎంచుకోవాలి. అలాగని ఖరీదైనవే వేసుకోవాలని లేదు. సాధారణ జీన్స్, టీ షర్ట్ అయినా సరే.. సందర్భానికి తగినట్లు ఉండాలి' అంది. అప్పట్నుంచి నా డ్రెస్సింగ్ స్త్టెలే మారిపోయిందంటే నమ్మండి అంటూ చెప్పుకొచ్చేసింది.
ఇక 'ఝుమ్మంది నాదం' చేస్తున్నప్పుడు అరకులో 'ఏం సక్కగున్నావ్‌రో' పాట షూట్ చేసి వెనక్కి వస్తున్నాం. మమ్మల్ని చూసి స్థానికులంతా ఒక్కసారిగా దగ్గరికొచ్చేశారు. ఆ అభిమానం నాకు కొత్త కదా! భయపడిపోయా. అప్పుడు లక్ష్మి నా చేయి పట్టుకుని పక్కకు తీసుకొచ్చింది. ఇప్పటికీ అంతే, 'గుండెల్లో గోదారి' చేస్తున్నప్పుడయినా, ఇద్దరం కలిసి బయటికి వెళ్లినప్పుడయినా... అక్కడి వాతావరణం నాకు సౌకర్యంగా ఉందా లేదా అన్నది తనే చూసుకుంటుంది. నేను ఏ రకంగానూ ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు నా బాగోగులు కనుక్కుంటుంది అని వివరించింది.


Click it and Unblock the Notifications












