విజయశాంతి బాటలో తాప్సీ..!

లేడీ సూపర్ స్టార్‌గా విజయశాంతికి తెలుగులో ఎంత పాపులారిటీ ఉందో కోలీవుడ్లో కూడా అంతే పాపులారిటీ ఉంది. దాంతో తాప్సీ స్టేట్‌మెంట్‌పై కోలీవుడ్లో విమర్శలు మొదలయ్యాయి. ముందు నటించడం నేర్చుకో. తర్వాత ఫైటింగులు చేద్దువుగానీ అంటూ కొందరు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాప్సీ మళ్లీ స్పందిస్తూ విజయశాంతి లాంటి గొప్ప నటి నాకు ఆదర్శం అంటే తప్పేంటి అంటూ కౌంటర్ ఇచ్చింది.
ప్రస్తుతం తాప్సీ వెంకటేష్ సరసన 'షాడో' లోనూ ఆది పినిశెట్టి సరసన 'గుండెల్లో గోదారి' సినిమాల్లో నటిస్తోంది. అలాగే హిందీలోనూ సిద్దార్ద సరసన నటిస్తూ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కెరీర్ లో ఇప్పటి వరకూ ఒక్క సరైన విజయం కూడా లేని తాప్సీకి వరస పెట్టి అవకాశాలు వస్తుండటం కూడా ఆమె అదృష్టమనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











