మెడికల్ స్టూడెంట్ గా తాప్సీ అందాల ఆరబోత
'వస్తాడు నా రాజు' చిత్రంలో తాప్సీ మెడికల్ స్టూడెంట్ గా చేసింది. అయితే ఆ పాత్రలోనూ ఆమె తనవితీరా అందాలు ఆరబోసిందంటున్నారు. ఇక బబ్లిగా వుండే ఈ అమ్మాయికి తన అన్నంటే ప్రాణం. ఆమె అన్నగా ప్రకాష్ రాజ్ నటించారు. అయన కూడా చెల్లలంటే అంటే విపరీతమైన అభిమానం. అందరి అమ్మాయిల్లానే ఆమె కూడా కలల్లో విహరిస్తూ ఉంటుంది. వాటిని హీరో ఎలా నిజం చేశాడు.. తాప్సీ ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది కధ. ఇక మంచు విష్ణు కిక్ భాక్సర్ గా కనిపిస్తాడు. అతని పాత్ర పేరు వెంకటప్పయ్య నాయుడు. ప్రేమాగీమా అంటూ పట్టింపులేనీ, వాటిపై నమ్మకంలేని కుర్రాడు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే టైపు. ఏ ఎండకా గొడుగు పట్టేస్తుంటాడు...అదీ అతని క్యారక్టైరేజేషన్. ఈ చిత్రం ద్వారా హేమంత్ మధుకర్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. 24 ఫ్రేమ్స్ సంస్థ నిర్మించింది. సంగీతం: మణిశర్మ. ఈ చిత్రం ఈనెల 11న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











