ఎంతసేపు హీరోలేనా మేం పనికిరామా?నిలదీసిన తాప్సీ...
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'ఝుమ్మంది నాదం' పరిచయమైన అందాల ముద్దుగుమ్మ తాప్సీ.ఈ చిత్రం ఫ్లాప్ అయినా వరసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ సంపాదించిన తాప్సీ తాజాగా సంతోషం అవార్డుల కర్టన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొని మీడియా వారిని ప్రత్యేకంగా ఆకర్షించారు. హీరోల కవరు పేజీలను మాత్రమే గత ఎనిమిదేళ్లుగా ప్రచురిస్తూ వస్తున్న మీరు హీరోయిన్లను మీ వేడుకలకు ఎందుకని పిలుస్తున్నారు?' అని సున్నితంగా ఆ పత్రిక వారిని నవ్వుతూనే ప్రశ్నించి, ఆపైన తన మనసులోని కోరికను ఆమె నెరవేర్చుకోగలిగారు. ఇంతకీ ఆ నెరవేరిన కోరిక ఏమంటే...ఇక మీదట హీరోయిన్స్ ఫొటోలు కూడా ఆ పత్రికలో కవరు పేజీగా ప్రచురిస్తామని, మొదటగా అచ్చయ్యే ముఖచిత్రం తాప్సీదే ఉంటుంది' అన్న హామీని ఆమె రాబట్టుకున్నారు. ఆ రకంగా మిగతా హీరోయిన్స్ కు కూడా ముఖచిత్ర ప్రచురణలో తాప్సీ దోహదం చేసినట్లయింది. దాంతో తాప్సీ పేరు పిల్మ్ సర్కిల్స్ లో తెలివిగల అమ్మాయిగా మారు మ్రోగుతోంది. ఇక ఇంతకీ తాప్సీకి సంతోషం గత ఎనిమిది సంవత్సరాలుగా హీరోల ఫోటోల నే వేస్తోందనే ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారనే ఆలోచన కూడా కొందరిలో కలిగింది. ఇక తాప్సీ ప్రస్తుతం ప్రభాస్ తో దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్రంలోను, విష్ణు సరసన మరో చిత్రంలోను, రవితేజ సినిమాలోను హీరోయిన్‌గా అవకాశాలు సంపాదించింది.


Click it and Unblock the Notifications











