తాప్సీ, మణిశర్మ రేడియో జోష్ (ఫోటోలు)
హైదరాబాద్: టాలీవుడ్ సెక్సీ హీరోయిన్ తాప్సీ, ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ శ్రీనగర్ కాలనీలోని రేడియోజోస్ సంస్థ కార్యాలయంలో సందడి చేసారు. ఆన్ లైన్ సంగీత ప్రియుల కోసం రేడియో జోష్ సంస్థ ప్రారంభించిన ఆన్ లైన్ సేవలను తాప్సీ ప్రారంభించగా, మణిశర్మ రేడియో జోష్ ఆండ్రాయిడ్ సేవలను ప్రారంభించారు.
రేడియో జోష్ వెబ్ సైట్లో లాగిన్ అయిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని పాటలను శ్రోతలు విన వచ్చని, సరికొత్త పరిజ్ఞానంతో రేడియో జోష్ వెబ్ సైట్ ప్రారంభించినట్లు సంస్థ సీఈవో అగ్నిపుత్ర వర్మ మీడియాకు వెల్లడించారు. సంగీత ప్రియులు పూర్తి సంతృప్తి చెందే విధంగా సేవలు అందించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తాప్సీ ప్రస్తుతం తాను నటిస్తున్న 'షాడో' మూవీ విశేషాలను వెల్లడించింది. వెంకటేష్ లాంటి పెద్ద హీరోలతో నటించడం చాలా ఆనందంగా ఉందని, అతని నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. అదే విధంగా గుండెల్లో గోదారి చిత్రంలో తన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంపై హ్యాపీగా ఫీలవుతున్నట్లు తెలిపింది.

రేడియో జోష్ ఆన్ లైన్ సేవలను ప్రారంభిస్తున్న తాప్సీ, మణిశర్మ.

లైవ్ కార్యక్రమంలో శ్రోతలతో మాట్లాడుతున్న తాప్సీ.

రేడియో జోష్ గురించి తాప్సీకి వివరిస్తున్న అగ్నిపుత్ర.

హాట్ అండ్ సెక్సీ లుక్ తో ఆకట్టుకున్న తాప్సీ.

హాట్ అండ్ సెక్సీ లుక్ తో ఆకట్టుకున్న తాప్సీ.

హాట్ అండ్ సెక్సీ లుక్ తో ఆకట్టుకున్న తాప్సీ.


Click it and Unblock the Notifications











