తాప్సీ కి బాలీవుడ్‌లో మరో ఆఫర్...డిటేల్స్

By Srikanya

ముంబై : 'చష్మే బద్ధూర్‌' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తాప్సీ అక్కడ కూడా మంచి మార్కులనే సంపాదించుకోవడంతో మరో చిత్రంలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. 'విక్కీ డోనర్‌' వంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించి పలు అవార్డులను సొంతం చేసుకున్న షూజిత్‌ సిర్‌కార్‌ నిర్మాతగా, అమిత్‌ రాయ్‌ దర్శకుడిగా మరో రెండు నెలల్లో షూటింగ్ కు ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఇంకా హీరోని ఎంపిక చేయని ఈ చిత్రంలో అంతా యువ బృందమే పాలుపంచుకోనున్నదని అంటున్నాడు నిర్మాత.

తనకు మరో హిందీ చిత్రంలో నటించడానికి అవకాశం వచ్చిందని తాప్సీ ఒప్పుకుంటున్నప్పటికీ వివరాలు వెల్లడించడానికి మాత్రం సుముఖంగా లేదు. తనకు ఈ సినిమా స్క్రిప్టు ఎంతగానో నచ్చిందని, సత్తా ఉన్న బృందంతో పనిచేసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని మాత్రం అంటుంది. తన పాత్ర కూడా కథలో ఒక భాగంగా ఉండాలని ఆశించానని, అలాంటి చిత్రంలో నటించే అవకాశం తనకు ఇంత తొందరగా వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్తోంది తాప్సీ.

ఇక తెలుగులో 'సాహసం' చిత్రంలో తాప్సీ చేసిన శ్రీనిధి పాత్రకు ఎంతో పేరు వచ్చింది. ఈ మధ్య మంచు లక్ష్మీప్రసన్న నిర్మించిన 'గుండెల్లో గోదారి'లో నెగటివ్ టచ్ ఉన్న సరళ పాత్రను చక్కగా పోషించి విమర్శకుల ప్రశంసలందుకున్న ఢిల్లీ సుందరి తాప్సీ తాజాగా అదే తరహా అభినందనలు అందుకుంటోంది.

తాప్సీ మాట్లాడుతూ "చాలా రోజులుగా నేను ఎదురు చూస్తున్న రోజు వచ్చింది! తొలి వారాంతానికి 70 శాతం బడ్జెట్ రికవరీ అవడంతో 'సాహసం' హిట్టయ్యిందని సంతోషంగా చెబుతున్నా. దీనికి కారకులైన మీకు థాంక్స్. ఈ సినిమాలో నేను చాలా అందంగా కనిపించానని ప్రశంసలు వస్తున్నాయి. ఈ విషయంలో నాకు మేకప్ చేసిన నిక్కీ రజనికీ, కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన దివ్య, లిప్సకు థాంక్స్ చెప్పుకుంటున్నా'' అని తెలిపింది. ప్రస్తుతం తమిళంలో ఆర్య సరసన 'వాలై', లారెన్స్ సరసన 'ముని 3' సినిమాలు చేస్తోంది తాప్సీ .

శ్రీదేవి, జయప్రద వంటి దక్షిణాది హీరోయిన్లు ఇక్కడ తమ సత్తా చూపించి బాలీవుడ్‌లో రాణించినవారే. ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాది చలనచిత్రాల్లో తమకంటూ ఒక స్ధానాన్ని ఏర్పరచుకున్న భామలు కూడా హిందీ చిత్రాల్లో తళుక్కున మెరవాలని, ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆశిస్తారు. ఉత్తరాది సుందరినే అయినప్పటికీ అతి తక్కువ సమయంలో తెలుగును నేర్చుకోవడమే కాకుండా తన అందం, అభినయాలతో కట్టిపడవేసిన హీరోయిన్‌ తాప్సీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X