మొహమాటపడదు కాబట్టే తాప్సీకి ఆఫర్స్
నేను హీరోయిన్ ని కదా..! నా పని ఏంటో తెలుసుకొంటే సరిపోతుందిలే.నాకు తెలియని విషయమైతే మొహమాటం లేకుండా అడిగి నేర్చుకుంటాను అని చెప్పుకొచ్చింది తాప్సీ. అయితే తాప్సీకి మొదటనుంచీ మంచి స్పీడు గర్ల్ అనే పేరుంది.ఎవరితోనన్నా పరిచయం అయిన కొద్ది సేపటిలోనే అల్లుకుపోగలదు అని చెప్తూంటారు. అందుకే ఆమెకు కంటిన్యూగా ఆఫర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఒకసారి తాప్సీతో పనిచేసినవారు వదులుకోవటానకి ఇష్టపడరని చెప్తారు.అందులోనూ అస్సలు ఏ విషయంలోనూ మొహమాట పడదని, మొహమాట పడేవాళ్ళను కూడా ఆమె మొహమాటం లేకుండా చేరదీస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. అందుకేనేమో నటన తెలియకపోయినా దూసుకుపోతోంది తాప్సీ. ప్రస్తుతం తాప్సీ.. గోపీచంద్ సరసన 'మొగుడు'లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











