వాళ్లు ఎలా ఎంజాయ్ చేస్తారో నేనూ అంతే...తాప్సీ
"లేదండి. ఎప్పుడూ ఎలా ఉంటానో ఇప్పుడూ అలానే ఉన్నాను. నా వయసున్నవాళ్లు ఎలా ఎంజాయ్ చేస్తారో నేనూ అంతే. నార్మల్ గాళ్‌లా భావిస్తున్నాను కాబట్టే నా ఫ్రెండ్స్‌తో గడపడం కోసం ఢిల్లీ వెళ్లా' అంటోంది తాప్సీ. ఝుమ్మందినాదం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ రోజు(ఆదివారం) పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ వేడుకను ఢిల్లీలో తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది. హీరోయిన్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ లో మార్చు వచ్చిందా? అని అడిగన ప్రశ్నకు తాప్సీ పై విధంగా స్పందించారు.
అలాగే గత ఏడాది తను సాదాసీదా తాప్సీని అని, ఈ ఏడాది హీరోయిన్‌గా తొలి పుట్టినరోజును జరుపుకుంటున్నానని అంది తాప్సీ. తాప్సీ ప్రస్తుతం విష్ణు సరసన ఒక సినిమా, ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అలాగే మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో ధనుష్ సరసన తాప్సీ నటించిన 'ఆడుకలమ్' చిత్రం త్వరలో విడుదల కానుంది. కోలీవుడ్ నుంచి కూడా తనకు ఆఫర్లు వస్తున్నాయి. పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఏడాదిలోపే కెరీర్ ఇంత విజయవంతంగా సాగడంపట్ల తాప్సీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ధట్స్ తెలుగు ...తాప్సీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











