మంచు మనోజ్ నాకు అన్నయ్య:తాప్సీ
సినీపరిశ్రమలో అడుగుపెట్టిన నాటినుంచి మోహన్‌బాబు, లక్ష్మి, విష్ణు, మనోజ్ నాకు తెలుసు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి వారే కారణం. మోహన్‌బాబు అంకుల్ నన్ను కూతురిలా చూసుకుంటే, లక్ష్మి, విష్ణు, మనోజ్ చెల్లెలిగా ఆదరిస్తారు. అటువంటిది మనోజ్‌కి, నాకు లింకులు పెట్టడం చాలా దారుణం అంటూ తాప్సీ తాజాగా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.
తనవల్లనే ప్రముఖ నటుడు మంచు మనోజ్, తమిళ నటుడు మహత్ గొడవ పడ్డారన్న వార్తలను సినీ నటి తాప్సీ ఖండించింది. తనకు ఈ గొడవకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమె రీసెంట్ గా ఓ ప్రకటన విడుదల చేసింది. చెన్నైలోని ఓ నైట్‌పార్టీలో తమిళ నటుడు మహత్‌పై ప్రముఖ నటుడు మంచు మనోజ్ దాడి చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాప్సీ స్పందించింది.మనోజ్ తనకు సోదరుడిలాంటివాడని, మహత్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తేల్చిచెప్పింది. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం తన పేరును దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
"ఆ గొడవ జరిగినప్పుడు నేను కర్నూలులో ఉన్నాను. గొడవకు నేను కారణమంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. నాకు ఎవరితోనూ సంబంధం లేదు. ఇంతకుముందూ ఇదే చెప్పాను. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను ఈ గొడవలోకి లాగే హక్కు ఎవరికీ లేదు. మహత్ గురించి చెప్పేది ఏమీ లేదు. ఇదొక విషాదకర ఘటనగా మరచిపోవాలనుకుంటున్నాను'' అని తాప్సీ పేర్కొంది.
ప్రస్తుతం తాప్సీ వెంకటేష్ సరసన 'షాడో' లోనూ ఆది పినిశెట్టి సరసన 'గుండెల్లో గోదారి' సినిమాల్లో నటిస్తోంది. అలాగే హిందీలోనూ సిద్దార్ద సరసన నటిస్తూ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇక 'ఝుమ్మంది నాదం'లో నన్ను అందంగా చూపించారు కాబట్టే నాయికగా ఆ తరవాత అవకాశాలు అందుకోగలిగాను. ఆ తరవాత అన్నీ వాణిజ్యపరమైన సినిమాల్లోనే నటించాను. వీటి మధ్య 'గుండెల్లో గోదారి' ప్రత్యేకంగా నిలుస్తుంది. మణిరత్నం దర్శకత్వంలో నటించాలనేది నా జీవిత ఆశయం. ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి అంది.


Click it and Unblock the Notifications











