మహత్ రాఘవేంద్రతో ఎఫైర్ విషయమై తాప్సీ...

By Srikanya

హైదారాబాద్: మహత్ రాఘవేంద్ర ని కలవడం మానేసి ఏడాదిన్నర అయ్యింది. కనీసం మా ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ కూడా లేవు. అయినా మహత్‌ ఒకప్పుడు మంచి స్నేహితుడు. సంవత్సరంన్నర నుంచి మా ఇద్దరి మధ్య ఆ స్నేహం కూడా లేదు. అనవసరంగా మా ఇద్దరి మధ్య లేనిపోని పుకార్లు పుట్టించారు. పుకార్లు వింటుంటే కెరీర్‌ మొదట్లో భయమేసేది. ఇప్పుడు వాటి గురించి పట్టించుకోవడమే మానేశాను అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ. రీసెంట్ గా మహత్ రాఘవేంద్ర...తాప్సీతో రెండేళ్లు డేటింగ్ చేసాను, ఈ విషయం లోకమంతటికీ తెలుసు. పర్సనల్ విషయాలను పర్సనల్ గానే ఉంచడం నాకిష్టం అంతకు మించి మాట్లాడటం ఇష్టం లేదన్నారు. దాంతో మీడియా వారు తాప్సీని ప్రశ్నించారు.

తాప్సీ హీరోయిన్ గా నటించిన 'గుండెల్లో గోదారి' చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. చిత్రం ప్రమేషన్ లో భాగంగా ఆమె మీడియాను కలిసింది. అలాగే తాజాగా నాకు వరుణ్‌ ధావన్‌కీ మధ్య ప్రేమాయణం జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక రోజు ఓ కప్పు కాఫీ కలిసి తాగామంతే. అంతమాత్రానికే మా మధ్య ప్రేమాయణం సాగుతుందంటే ఎలా? (నవ్వుతూ) ఇలా ఓ కప్పు కాఫీ నా జీవితాన్నే మార్చేస్తుంది అనుకోలేదు అంది. అయినా నాకు నా తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది. నేనేంటో వాళ్లకు తెలుసు. అందుకే ఈ పుకార్లను పెద్ద పట్టించుకోను. పైగా నా గురించి తెలుసుకోవడానికి ఇంత ఆసక్తిని కనబరుస్తున్నారంటే... నేను కొంత వరకు సాధించినట్లేకదా అని వివరించింది.

ఇక గుండెల్లో గోదారి చిత్రం గురించి చెప్తూ... ''ఈ చిత్రంలో ఆదికీ నాకూ మధ్య సాగే ఓ గీతం కాస్త ఘాటుగానే ఉంటుంది. ఆ పాటలో నటించడానికి మొదట నేను భయపడ్డాను. ఇలాంటివి చేయడం నావల్ల కాదని కూడా దర్శకుడు కుమార్‌ నాగేంద్రతో చెప్పేశాను. ఆ పాటలో బెడ్‌ సీన్స్‌ చేయడంలో ఆది సహకారమే కీలకం. సన్నివేశం పూర్తయ్యాకా బుద్ధిగా చొక్కా వేసుకుని ఓ మూలన కూర్చొనేవాడు. ఆ పాట అంత బాగా వచ్చిందంటే కారణం ఆదియే'' అంది.

ఇక ఆది నేను సైకిల్‌పై సినిమాకి వెళ్లే సన్నివేశం తీసేటప్పుడు జనం చాలామంది వచ్చారు. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ క్షణంలో ఎంతో ఆనందం కలిగింది. నాకు చేపల వాసనంటేనే పడదు. వాటిని శుభ్రం చేసే సన్నివేశం చేసేటప్పుడు ఇబ్బందిపడ్డాను. గోదావరి ప్రాంత ప్రజలు ఎంతో ప్రేమగా రకరకాల చేప వంటకాలు తెచ్చేవారు. నాకు ఇష్టం లేకపోయినా లక్ష్మీప్రసన్న బలవంతంగా తినిపించేది అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X