For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు అవార్డు వచ్చినా ఆశ్చర్యపోఅక్కరలేదు: హాట్ హీరోయిన్

    By Sindhu
    |

    హీరోయిన్స్ లోని గ్లామర్, టాలెంట్ ని కృష్ణవంశీ బాగా వాడుకుంటున్నాడు. ఆయన సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత ఆ హీరోయిన్స్ కి బాగా పేరొస్తుంది. అప్పట్లో ఛార్మీకి కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన సినిమాలు మంచి పేరు తెచ్చాయి. ఆమెతో డబ్బింగ్ కూడా చెప్పించి, తెలుగు ఫర్ ఫెక్ట్ గా వచ్చేట్లు చేశాడు కృష్ణవంశీ.

    ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా రూపొందుతున్న 'మొగుడు"లో తాప్పీ ఒక కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. మాంగల్యం ఉండాల్సింది మగువ గుండెలపై మాత్రమే కాదు. మగాడి గుండెల్లో ఉండాలి అన్నఅప్పుడే వారిది ఆదర్శ దాంపత్యం అవుతుంది అనే అందమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'మెగుడు".

    ఇంతటి పవర్ ఫుల్ కాన్సెఫ్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా పై తాప్సీ బారీ ఆశలే పెట్టుకొంది. తాప్పీ ఇందులో చాలా మెచ్యుర్డ్ గా యాక్ట్ చేసిందని, తన నటనకు అవార్డు వచ్చినా ఆశ్చర్యపోఅక్కరలేదని చెబుతోంది. ఈ చిత్రంలో తాప్సీ తన పాత్రకు తనే. డబ్బింగ్ చెప్పుకుంటోంది. కృష్ణవంశీ గారి ప్రోత్సాహంవల్లే ఇది కుదురుతోందని తాప్పీ పేర్కొంది. ఇదిలా ఉంటే..ఆల్రెడీ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్"కి తాప్పీ డబ్బింగ్ చెప్పింది. ఆ సినిమాకన్నా ఇంకా బెటర్ గా డబ్బింగ్ చెబుతుందని మనం ఊహించవచ్చు.

    English summary
    Krishna Vamsi is known for bringing out the best in any actor and Tapsi hopes that her performance in Mogudu will be talked about. She will now expect few awards too as she is dubbing on her own for this film. Tapsi has dubbed in her own voice for Mr. Perfect.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X