తాప్సీ చీరకట్టు సింగారం అదిరింది (ఫోటోలు)
ముంబై: సౌతిండియా గ్లారమ్ తారల్లో ఢిల్లీ బ్యూటీ తాప్సీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పక తప్పదు. తొలి చిత్రం 'ఝుమ్మందినాదం'తోనే రాఘవేంద్రరావు చేతిలో పడ్డ అమ్మడు తొలి చిత్రంతోనే గ్లామర్ పరంగా అలరించింది. సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ రంగంలో రాణించింది. సినిమా రంగంలో చెప్పుకోదగ్గ హిట్లు లేక పోయినా గ్లామర్‌తో కెరీర్ నెట్టుకొస్తోంది.
అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలలో తాప్సీ హాట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తాప్సీ చీరకట్టులో సింగారాలు ఒలక పోసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ డిజైన్ చేసిన వివిధ డిజైన్స్ ఆమె ప్రదర్శించారు.
పసుపు, ఎరుపు, గోధమ వర్ణంతో కూడిన డిజైన్స్ తాప్సీ అందాలకు మరింత వన్నె తెచ్చాయి.
అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

తాప్సీ
తాప్సీ పంజాబీ అయినప్పటికీ వారి కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అయిన తాప్సీ మోడలింగ్ పై ఆసక్తితో అటు వైపు అడుగులు వేసింది.

టైటిల్స్
మోడలింగ్ చేస్తున్న సమయంలో " ఫెమీనా మిస్ బ్యూటిఫుల్ స్కిన్" "ఫెమీనా మిస్ ఫ్రెష్ ఫేస్ పంటలూన్స్ " వంటి టైటిల్స్ గెలుచుకుంది.

సినీ రంగం
రాఘవేంద్ర రావు దర్శకత్వం లో 2010లో తెలుగు సినిమా ఝుమ్మంది నాదం తో నటన జీవితాన్ని ప్రారంభించారు. తెలుగుతో పాటు, తమిళం, హిందీ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ కొనసాగిస్తోంది.

తెలుగులో...
కెరీర్లో ఇప్పటి వరకు ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించింది తాప్సీ. అయితే ప్రస్తుతం మాత్రం ఆమె చేతిలో తెలుగు సినిమాలు లేవు. లారెన్స్‌తో ‘ముని-3:గంగా' అనే సినిమా కమిటైనా ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు
ప్రస్తుతం తాప్సీ హిందీలో ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్' అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో వాయ్ రాజా వాయ్ అనే చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











