రవితేజతో మరోసారి ప్రమోషన్ కొట్టేసిన అందాలముద్దుగుమ్మ..!?
పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీకి సెకెండ్ హీరోయిన్ స్థానం నుంచి ప్రమోషన్ లభించినట్టుంది. నిన్న మొన్నటి వరకు తను నటించిన ప్రతి చిత్రంలోనూ రెండో కథానాయికగా సంతృప్తి పడ్డ తాప్సీ కృష్ణవంశీ రూపొందిస్తున్న 'మొగుడు" చిత్రంతో తన పంథాను మార్చుకున్నట్టు కనిపిస్తోంది. అటు అభినయంలోనూ, ఇటు అందాల ఆరబోతలోనూ కూడా చాలా కష్టపడుతున్న ఉత్తరాది భామ తాప్సీ, త్వరలో విడుదలయ్యే 'మొగుడు' సినిమాతో టాలీవుడ్ లో తన రేంజే మారిపోతుందని సన్నిహితుల వద్ద చెబుతోందట.
అయితే, అది రిలీజవ్వకుండానే ఆమె రేంజ్ మారిపోయేలా కనిపిస్తోంది. మంచి ఆఫర్లు వస్తున్నాయి. మొన్నీ మధ్యనే ఇక సెకెండ్ హీరోయిన్ వేషాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తున్నానంటూ ప్రకటించిన తాప్సీ త్వరలో రవితేజ హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో మొయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
గతంలో గోపీచంద్ తో 'శౌర్యం' చిత్రాన్ని రూపొందించిన తమిళ దర్శకుడు శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ ఈ చ్రితాన్ని నిర్మించనున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం నవంబర్ 1నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది. రవితేజ నటించిన 'వీర" చిత్రంలో కాజల్ మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ చేయగా రెండవ హీరోయిన్ గా సరిపెట్టుకున్న తాప్సీ త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా రవితేజ పక్కన ప్రమోషన్ కొట్టేయడం విశేషం.


Click it and Unblock the Notifications











