ఆ మాటవినగానే కంగారుపడ్డా: తాప్సీ
'ఝుమ్మంది నాదం' చిత్రంతో పరిచయమైన తాప్సీ వరసగా సినిమాలు చేసుకుంటూ తెలుగులో బిజీ హీరోయిన్ గా ఎదుగుతోంది. ఈ క్రమంలో ఆమె తొలిరోజులను గుర్తు చేసుకుంటూ... సృజనాత్మక రంగంలోనే ఉండాలి అని ముందే అనుకొన్నాను. అందుకే బాగా చదువుకొని కూడా ఇటు వైపు వచ్చాను. సినిమాల్లో నటిస్తావా? అనే మాట తొలిసారి వినగానే కంగారుపడిపోయాను. చేరాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి చాలా కాలం పట్టింది. మొత్తమ్మీద రావల్సిన రంగంలోకే వచ్చాను అంది.అలాగే ప్రతిభ ఉంటే ఎక్కడైనా ఒక్కటే. పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడం, వెంటనే అలవాటుపడిపోవడం నాకు బాగా తెలుసు.
అందుకే సినిమా వాతావరణాన్ని తొందరగానే అర్థం చేసుకొన్నాను. ఒక వేళ సినిమాల్లోకి రాకుండా వేరే రంగంలో స్థిరపడితే అక్కడ కూడా అందరి దృష్టినీ ఆకర్షించడానికి ప్రయత్నించేదాన్ని అంటోంది తాప్సి.ఇక అయితే ర్యాంప్ షోలు ఎప్పటికీ చేయను. ఎందుకంటే అందులో వ్యాపారం తప్ప సృజన ఉండదనేది నా ఉద్దేశం అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తాప్సీ మొగుడు చిత్రంలో చేస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో గోపీచంద్ కి భార్యగా కనపించబోతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











