తాప్సీకి ఈ చిత్రమే లాస్ట్ ఛాన్స్

By Srikanya

హైదరాబాద్ : కెరీర్ లో ఒక్క హిట్ లేకపోయినా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరోయిన్ తాప్సీ. అది ఆమె అదృష్టమో..అందం మహిమో కానీ ఇప్పటివరకూ ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఆమె చేసిన చిత్రం ఒక్కటి ఆడకపోవటంతో ఇప్పుడు ఆమె పరిస్ధితి డైలమోలో పడింది. మొదటి ఉన్న ఊపు తగ్గిపోయింది. హీరోలు ఎవరూ ఆమె అంటే ఆసక్తి చూపటం లేదు.

దాంతో ఆమె దృష్టి మొత్తం సాహసం మీదే ఉంది. గోపీచంద్, తాప్సీ కాంబినేషన్ లో యేలేటి చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రం 'సాహసం'. ఈ చిత్రం హిట్టయితేనే ఆమె మనుగడ ఉంటుంది . దాంతో ఈ చిత్రంపైనే తాప్సీ తన ఆసలు మొత్తం పెట్టుకుంది.

'సాహసం' చిత్రం లో తాప్సీ ది...పరమ భక్తురాలి పాత్ర. దేవుళ్లు, గుళ్లు అంటూ తిరుగుతుంది. ఈ ప్రపంచం ఇలాగే అక్రమాలతో కొనసాగితే ఇంకో రెండు మూడేళ్లలో అంతం కావడం ఖాయం అన్నట్టు ప్రవర్తిస్తుంది. భక్తిని అందరిలోనూ పెంపొందించడానికి ప్రయత్నించే పాత్ర.

ఇక గోపీచంద్ ఈ చిత్రంలో సెక్యూరిటీ గార్డ్‌గా కనిపిస్తాడు. బాగా డబ్బులు సంపాదించాలన్నది అతని కల. కానీ అనుకోకుండా జరిగిన ఓ చిన్న సంఘటన ద్వారా అతను బీదవాడు కాదని, ఆస్తిపరుడని తెలుస్తుంది. ఆ తర్వాత ఎలా ఆ నిధులను కైవసం చేసుకున్నాడన్నది స్టోరీ.

'సాహసం' చిత్రాన్ని బి.వి. ఎస్.ఎన్‌పసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది అడ్వెంచరస్ చిత్రం. అందుకే 'సాహసం' అనే పేరు పెట్టారు. అరగంట నుంచి 45 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయి.

హీరో దేనికోసం వెళ్లాడు, అది తీసుకురావడానికి ఎలా కృషి చేశాడు అని చెప్పే క్రమంలో కొంత సీజీ వర్క్‌ను పెట్టాల్సి వచ్చింది అని దర్శకుడు చెప్పారు. అలాగే ఉత్తరాదినే ఎక్కువ భాగాన్ని చిత్రీకరించినట్టున్నారు.

యేలేటి ఈ విషయమై చెప్తూ...లడఖ్‌లో ఎక్కువ శాతం షూటింగ్ చేశాం. 1947లో మన దేశ విభజన జరిగినప్పుడు అటు నుంచి కొందరు ఇటు వచ్చారు. ఇటు నుంచి కొందరు అటు వెళ్లారు. ఆ క్రమంలో వాళ్ల ఆస్తులను కూడా వదులుకుని వెళ్లారు. ఆ విషయాలను ప్రస్తావిస్తాం. ట్రెజర్ హంట్ మెయిన్ స్ట్రీమ్‌గా వెళ్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్ అట్లూరి, సుమలత, కెమెరా: శామ్‌దత్, సంగీతం: శ్రీ, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X