For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్యాక్ సైడ్ న్యూడ్ గా తాప్సీ (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: 'ఝుమ్మంది నాదం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దు గుమ్మ తాప్సీ. ఈ డిల్లీ భామ కెరీర్ లో ఒక్క సరైన హిట్టూ లేకపోయినా వరస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. కెరీర్ ప్రారంభం నుంచీ పెద్ద హీరోలతోనే తన ప్రయాణం అన్నట్లుగా ఆచి తూచి అడుగులు వేస్తూ తన డైరీని ఖాళీ లేకుండా బిజీ చేసుకుంటోంది. తమిళ భాషలో సైతం ఆమెకు ఉన్న క్రేజ్ తో రెమ్యునేషన్ లోనూ ఆమె టాప్ స్ధాయిలోనే ఉంది. సరైన హిట్ పడితే నెంబర్ వన్ పొజీషన్ కి ఆమె చేరుకుంటుది. నటనపరంగా పెద్దగా ఆమెకు మార్కులు లేకపోయినా వరస ఆఫర్స్ వెనక రహస్యం ఏమిటీ అంటే.. గ్లామర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ గ్లామర్ ని ఆవిష్కరించిన ఫోటోలు... మీ కోసం

  తాప్సీ తొలి సినిమా నుంచి నటన కన్నా అందాల ఆరబోత కే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అందుకే ఝుమ్మందినాదం ప్లాప్ అయినా ఆమెకు డిమాండ్ తగ్గలేదు. కేవలం తాప్సీ కోసం ఆ సినిమా చూడాలనేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాప్సీ ఎంటర్ అవగానే ఇండస్ట్రీలో అందరి దృష్టిలో పడింది. అయితే ఇప్పుడు తాను రూటు మారుస్తానంటోంది. గుండెల్లో గోదావరి చిత్రంలో తన నటనా విన్యాసాలు చూడమని సవాల్ విసురుతోంది. సినిమా రిలీజ్ అయితేగానీ అది పబ్లిసిటీ స్టంటా లేక తాప్సీ లో నటి నిజంగా ఉందా అనే విషయం నిర్ధారణ కాదు.

  హిట్టు, ప్లాప్ లతో సంభదం లేకుండా తమిళ, తెలుగు భాషల్లో దూసుకుపోతున్న తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ తన వరస ఆఫర్స్ తో తోటి హీరోయిన్స్ కి ఝలక్ ఇస్తోంది. రామ్ సరసన ఓ చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. రామ్ హీరోగా స్రవంతి రవికిశోర్ ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రంలో తాప్సీని హీరోయిన్ గా అడిగారు. డేట్స్ ని కష్టపడి ఎడ్జెట్ చేసుకుని మరీ కాల్ షీట్స్ ఖరారు చేసింది.

  ఒక తమిళ చిత్రంతో పాటు తెలుగులో దాదాపు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారామె. హిందీలో తాప్సీ నటించిన ‘చష్మే బద్దూర్' త్వరలో విడుదల కానుంది. తాప్సీ ముఖంలో కనుపడే అమాయికత్వం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందంటున్నాడు.

  ప్రస్తుతం ఆమె తెలుగులో గుండెల్లో గోదారి చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ చిత్రం మరందేన్ మనిత్తేన్ పేరుతో తమిళంలోను విడుదల కానుంది.

  వెంకటేష్ సరసన షాడో చిత్రంలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నాడు. గ్యారెంటీగా ఈ చిత్రం తనకు పేరు తెచ్చిపెట్టి కెరీర్ లో నిలబెడుతుంది అంటోంది.

  గోపిచంద్‌కు జంటగా ఒక యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాను. మరికొన్ని చిత్రాల ఒప్పందాలపై సంతకం చేయాల్సి ఉంది అని చెప్పింది. గోపీచంద్-చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఒక్కడున్నాడు' చిత్రం తర్వాత మళ్లీ అయిదేళ్ల విరామం తీసుకుని వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు.

  ‘ఛస్మే బద్దూర్' అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశిసించి అక్కడా సెటిల్ అవ్వాలనే చూస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్లాసిక్ చిత్రం ఛస్మే బద్దూర్ రీమేక్ లో ఎంపికవటం చాలా ఆనందాన్ని ఇస్తోంది అంటోంది. ముగ్గురు అబ్బాయిలు... ఒకమ్మాయి మధ్య జరిగే ఈ తమాషా కథలో కాస్త సెక్సీ లుక్ తో పాటు రెగ్యులర్ హీరోయిన్ కాకూడదని ఆయన భావించి ఆమను ఎంపికచేసారని చెప్తున్నారు.

  పాత్రల ప్రాధాన్యం విషయంలో దర్శకుల్ని తప్పుబట్టడానికి వీల్లేదు. కచ్చితంగా తన సినిమాలో ప్రతి పాత్రనీ ఉన్నతంగానే తీర్చిదిద్దాలనుకొంటారు. కానీ అది ఎల్లవేళలా సాధ్యం కాదు. చాలా విషయాల్లో సర్దుకుపోవల్సి వస్తుంది అని తాప్సీ చెప్తోంది.

  హీరోయిన్ గా ప్రత్యేకమైన లక్ష్యాలేం లేవు. సినిమా ఫలితం బాగా వస్తే... అంతే చాలు. ఈ ప్రయాణంలో నా పాత్ర ప్రాముఖ్యం ఎంత? అనే విషయానికి ప్రాధాన్యం తగ్గింది. ఇది వరకు సినిమా మొత్తం నేనే కనిపించాలి అనుకొనేదాన్ని. ఇప్పుడు ఆ ఆలోచన మారింది. మంచి చిత్రం చేస్తే చక్కటి ఫలితం వస్తుందని గ్రహించాను అంది.

  English summary
  Tapsi busy with four projects. She is happy with another big movie - Ram's new film under Sravanthi Ravi Kishore Banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X