షూటింగ్ లో ప్రమాదం...గాయాలతో తాప్సి
ఝుమ్మందినాదం చిత్రంతో పరిచయమైన ముద్దు గుమ్మ తాప్సీ ప్రమాదానికి గురైంది. నిన్న(మంగళవారం) హైదరాబాద్ లో మంచు విష్ణు వర్ధన్ షూటింగ్ జరుగుతూండగా ఈ ప్రమాదం ఎదురైంది.షూటింగ్ లో భాగంగా క్రికెట్ ఆడుతూండగా..క్రికెట్ బాల్ వచ్చి ఆమె ముఖానికి వేగంగా తగిలింది. దాంతో ముఖంపై పెద్ద దెబ్బ తగిలి కమిలిపోయింది. వెంటనే ఆమెను హాస్పటిల్ కి తీసుకెళ్లారు. ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్లు పెద్దగా ప్రమాదం లేదుకానీ కొద్ది రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని సమాచారం. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు కొందరు వెంటనే ఆమెను పలకరించటం,ఎలా ఉందోనని ఆత్రుతగా విచారించటం విశేషంగా చెప్పుకున్నారు.
తాప్సీ ఝుమ్మందినాదం విష్ణువర్ధన్ మంచు మనోజ్ కె రాఘవేంద్రరావు మోహన బాబు tapsi jhummandi naadam vishnuvardhan manchu manoj mohan babu


Click it and Unblock the Notifications