జూ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసిన మంచు ఫ్యామిలీ హీరోయిన్..
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం చిత్రంలో నటించిన అందాల ముద్దుగుమ్మ తాప్సీకి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. మంచు మనోజ్‌తో నటించిన తొలి చిత్రంలో అందాలను ఆరబోసిన తాప్సీకి, మంచి ఫ్యామిలీలోని మరో హీరో మంచు విష్ణువర్ధన్‌తో నటించే ఛాన్సు లభించింది. ఇలా మంచు ఫ్యామిలీకే పరిమితమవుతుందనుకున్న సమయంలో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చి సరికే తాప్సీ ఎగిరి గంతేసిందని సమాచారం. ప్రస్తుతం విష్ణుతో వస్తాడు నా రాజులో హీరోయిన్‌గా తాప్సీ నటించింది. ఈసినిమా జనవరిలో విడుదల కావాల్సి ఉంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రంలో తాప్సీ కథానాయికగా గ్లామర్ పంట పండించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ఇందులో రెండో హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. అలాగే కిక్ శ్యామ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఛత్రపతి ఫేమ్ బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు, సురేందర్ రెడ్డి అశోక్ అనే బ్రహ్మాండమైన హిట్ నుఅందివ్వడం జరిగింది. ఈసినిమాలో ఎన్టీఆర్ సరసన సమీరా రెడ్డి నటించారు.
అందాల ముద్దుగుమ్మ తాప్సీ నటించిన 'వస్తాడు నా రాజు' కొత్త సంవత్సరంలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తూ దశరథ్ దర్శకత్వం వహించే 'మిస్టర్ ఫర్‌ఫెక్ట్', రవితేజ హీరోగా నటించే వీర వంటి చిత్రాల్లో తాప్సీ నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











