మంచు లక్ష్మీతో పాటు తాప్సీ కూడా...
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో 'గుండెల్లో గోదారి' అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆవిడే. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సెక్సీ గర్ల్ తాప్సీ తోపాటు, ఆది పనిశెట్టి కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. జనవరి 7 నుంచి తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో ఈ చిత్రం చిత్తీకరణ జరుపనున్నారు. పాలాని కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మురళి కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. మే నెల కల్లా సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
అనగనగా ఓ ధీరుడు చిత్రంతో విలన్ పాత్రలో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన లక్ష్మి ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'డిపార్ట్ మెంట్' చిత్రంలో సంజయ్ దత్ భార్యగా నటిస్తోంది. గుండెల్లో గోదావరి చిత్రం ద్వారా లక్ష్మి హీరోయిన్ రేంజి పాత్రలో పాజిటివ్ రోల్ లో తన సత్తా నిరూపించుకోవాలనే ఆలోచనలో ఉంది.


Click it and Unblock the Notifications











