షాకింగ్: తాప్సీకి పబ్లిక్‌గా కో-స్టార్ ముద్దులు (ఫోటోలు)
ముంబై: హీరోయిన్ తాప్సీని తన కో-స్టార్ పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్నాడు. తాప్సీ నటిస్తున్న రన్నింగ్ షాదీ డాట్ కామ్ చిత్రం ప్రెస్ మీట్‌కు హాజరైన సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇలా తాప్సీని పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోవడం చూసిన మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ వ్యక్తి పేరు అమిత్ సాధ్. తాప్సీ కలిసి త్వరలో రాబోతోతున్న హిందీ మూవీ 'రన్నింగ్ షాదీ డాట్ కామ్' చిత్రంలో కలిసి నటిస్తున్నాడు.
ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్కులో భాగమే అని స్పష్టమవుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

ఫోటో: అమిత్ సాధ్‌తో కలిసి తాప్సీ
రన్నింగ్ షాదీ డాట్ కామ్ ప్రెస్ మీట్లో భాగంగా అమిత్ సాధ్, తాప్సీ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

తాప్సీని ముద్దాడుతున్న దృశ్యం
మీడియా ప్రతినిధుల ముందు కెమెరా మెన్లకు పని కల్పించేలా ఇలా ఉన్నట్టుండి తప్సీని ముద్దాడాడు అమిత్ సాధ్.

పబ్లిసిటీ కోసమేనా?
పబ్లిసిటీ గిమ్మిక్కుల్లో భాగంగానే అమిత్ సాధ్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తాప్సీ ముందు తెలుసా? లేక ఆమె కూడా ఇది సడెన్ సర్‌ప్రైజా అనేది తేలాల్సి ఉంది.

రన్నింగ్ షాదీ డాట్ కామ్
రన్నింగ్ షాదీ డాట్ కామ్ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది.

మల్టిపుల్ ప్రాజెక్టులతో తాప్సీ బిజీ
ప్రస్తుతం తాప్సీ మల్టిపుల్ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. హిందీలో రన్నింగ్ షాదీ డాట్ కామ్ చిత్రంతో పాటు, తెలుగులో ముని 3: గంగ, తమిళంలో వాయ్ రాజా వాయ్ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











