twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'తాప్సీ నా చెల్లెలు లాంటిది' అంటున్న యంగ్ హీరో

    By Srikanya
    |

    ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ..ఆంధ్రప్రదేశ్ లో కుర్రాళ్ళకి తాపం పెంచిన సంగతి తెలిసిందే. ఈ విషయం అర్దం చేసుకున్న మంచు ఫ్యామిలీ వెంటనే ఆమెను తమ తదుపరి చిత్రం వస్తాడు నా రాజులోకి ఆమెను తీసేసుకున్నారు. మంచు విష్ణు వర్ధన్ హీరోగా చేసిన ఈ చిత్రంలో ఆరబోసిన తాప్సీ హాట్ హాట్ అందాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో ఈ జంటని జెమినీ ఛానెల్ వారు నువ్వు-నేను పోగ్రామ్ కి పిలిచారు. అందులో మాట్లాడుతూ...విష్ణు...తాప్సీ గురించి విచిత్రంగా మాట్లాడాడు. తాప్సీ నా చెల్లెలు లాంటిది. ఆమె మా కుటుంబంలో బాగా కలిసిపోయింది. తను నన్ను సోదరుడులాగానే ట్రీట్ చేస్తుంది అన్నాడు. భార్యకి భయపడే అన్నాడో నిజంగానే మనస్సులోంచే ఆ మాటలు వచ్చాయో గానీ చూస్తున్న వారికి షాక్ కొట్టినట్లయింది.

    తెరపై అంత రొమాన్స్ పండించే హీరో తన స్నేహితురాలు అన్నా ఇబ్బంది ఫీలవరు ఏమో గానీ ఆమెను చెల్లెలు అనటం మాత్రం జీర్ణించుకోలేని విషయమే అంటున్నారు. అందులోనూ ఆ మధ్య 'వస్తాడు నా రాజు' చిత్రం ట్రైలర్స్ లో ఒక దానికి కి సెన్సార్ నో చెప్పింది. దాంతో విష్ణు సెన్సార్ వారిపై మండిపడ్డాడు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..."'సడేమియా...' పాటలో తాప్సి గాగ్రా చోళీ వేసుకొని ఉంటుంది. నాభి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దృశ్యాన్ని తొలగించాలని సెన్సారు వారు పట్టు పడుతున్నారు. హీరోయిన్ బొడ్డు కనిపించినంత మాత్రాన కత్తెర వేయడం పద్దతి కాదు" అన్నారు అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X