మలేషియాలో తాప్సీ 'మొగుడు'
గోపీచంద్, తాప్సీ కాంబినేషన్ లో కృష్ణ వంశీ దర్సకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మొగుడు'. శ్రద్ధాదాస్ మరో హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంకి సంభందించి ప్రస్తుతం మలేసియాలో పాటలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)చిత్ర విశేషాలను మీడియాకు తెలియచేసారు. ఆయన మాటల్లోనే...మెడలో మూడుముళ్లు వేసిన ప్రతి ఒక్కడూ మొగుడు కాలేడు. తనని నమ్మి వచ్చిన మగువ మనసు గెలుచుకున్నవాడే నిజమైన మొగుడు.. మగాడు. ఈ విషయాన్నే కృష్ణవంశీ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. పదహారణాల తెలుగుదనం నిండిన కథ ఇది. తెరపై కుటుంబ బంధాల్ని ఆవిష్కరించే తీరు కంటికింపుగా ఉంటుంది. రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. రోజా, నరేష్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భవ్య, సంగీతం: బాబూశంకర్, ఛాయాగ్రహణం: శ్రీకాంత్.


Click it and Unblock the Notifications











