మంచు మనోజ్ తో రిలేషన్ పై తాప్సీ ట్వీట్
తాప్సీ కీ,మంచు మనోజ్ కి లింక్ లు పెడుతూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దానికీ తోడు రెండు రోజుల క్రితం మంచు మనోజ్ ఫిల్మ్ ఫేర్ పంక్షన్ లో తాప్సీ కోసం ఒక హీరోని కొట్టారంటూ వార్తలు వచ్చాయి. మంచు మనోజ్ పై ఆ తమిళ హీరో కేసు సైతం పెట్టారు. ఈ నేఫద్యంలో తాప్సీ తనకూ మంచు మనోజ్ కు రిలేషన్ లేదన్నట్లుగా...ట్వీట్ చేసింది. నేను ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేను అంటూ ట్విట్టర్ లో రాసి సమాధానమిచ్చింది.
ప్రస్తుతం తాప్సీ వెంకటేష్ సరసన 'షాడో' లోనూ ఆది పినిశెట్టి సరసన 'గుండెల్లో గోదారి' సినిమాల్లో నటిస్తోంది. అలాగే హిందీలోనూ సిద్దార్ద సరసన నటిస్తూ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇక 'ఝుమ్మంది నాదం'లో నన్ను అందంగా చూపించారు కాబట్టే నాయికగా ఆ తరవాత అవకాశాలు అందుకోగలిగాను. ఆ తరవాత అన్నీ వాణిజ్యపరమైన సినిమాల్లోనే నటించాను. వీటి మధ్య 'గుండెల్లో గోదారి' ప్రత్యేకంగా నిలుస్తుంది. మణిరత్నం దర్శకత్వంలో నటించాలనేది నా జీవిత ఆశయం. ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి అంది.
అలాగే ఇప్పటి వరకూ నేను నటించిన సినిమాలన్నీ నాకు నచ్చే చేశాను. అవి ప్రేక్షకులకు నచ్చాయా..లేదా అనేది వేరే విషయం. ఎందుకంటే నా గదిలో కూర్చుని ప్రేక్షకులందరి ఆలోచనల్ని పసిగట్టడం దాదాపు అసాధ్యం. ఎక్కువ మందికి చేరువైందా..లేదా..అనే విషయాలను పట్టించుకొంటే చాలు అని శెలవిచ్చింది. తాప్సీ ప్రస్తుతం గోపీచంద్ తో మరో చిత్రం చేస్తోంది. గోపీచంద్,తాప్సీ కాంబినేషన్ లో మొగుడు చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఆమె సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతున్న నేపధ్యంలో ఆమె 'దరవు'పై ఆశలు పెట్టుకుంది. అయితే అదీ ఆమెకు నిరాసపరిచింది.


Click it and Unblock the Notifications











