ముద్దు సీన్‌పై క్లారిటీ ఇచ్చిన తాప్సీ
హైదరాబాద్: తాప్సీ, ఆది, మంచు లక్ష్మి, సిందీప్ కిషన్ ప్రధాన పాత్ర దారులుగా నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గుండెల్లో గోదారి'. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది. ఈచిత్రంలో తాప్సీ-ఆది మధ్య ఘాటైన రొమాంటిక్ సీన్లు చిత్రీకరించారని, వీరిద్దరి మధ్య ఉండే ముద్దు సీన్ కు సెన్సార్ బోర్డు కత్తెర వేసిందనే రూమర్ ఆ మధ్య వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని అంటోంది తాప్సీ. ఈ చిత్రంలో తాను ముద్దు సీన్ చేయలేదని, ఈ చిత్రంలోనే కాదు నా కెరీర్లో ఇప్పటి వరకు ఎప్పుడూ ముద్దు సీన్ చేయలేదని.... ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తారో తెలియడం లేదు అంటూ మండి పడింది.
1986లో వచ్చి గోదావరి వరదల నేపథ్యంలో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటి సినిమాలకు పూర్తి భిన్నంగా ధీన్ని తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందించడం మరో విశేషం. ఇప్పటికే విడుదలైన పాటల మంచి ఆదరణ పొందాయి. ప్రకృతి విలయం వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందించారు.
కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రంలో చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











