ఆ ఛానల్ ఎండీ ముందు... తాప్సీ మొత్తం విప్పిందా?

By Bojja Kumar

హైదరాబాద్: ఎలాంటి దాపరికాలు లేకుండా నోట్లో ఉన్నది బయటికి కక్కేయడం, మొహమాటం లేకుండా మనసు విప్పేయడం హీరోయిన్ తాప్సీ ఉన్న అలవాటు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో ఎలాంటి మొహమాటం లేకుండా పలు సంచనల వ్యాఖ్యలు చేసింది ఈ భామ. తాజాగా తాప్సీ ఏబీఎన్ ఛానల్ లో ప్రసారం అయ్యే 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొంది. ఈ విషయాన్ని తాప్సీ స్వయంగా ట్విట్టర్లో వెల్లడించింది.

'ఎ.బి.ఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో ప్రసారమయ్యే ఫేమస్ ' ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె' అనే ప్రోగ్రాంలో ఇంటర్వ్యూకి ఆహ్వానించిన తొలి తెలుగు హీరోయిన్ నేనే అవ్వడం చాలా నాకు చాలా ప్రత్యేకమైనది. అలాంటి అరుదైన అవకాశం నాకు దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని' తాప్సీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేసే ఎబిఎన్ ఎండీ రాధాకృష్ణ తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ సంచలన విషయాలు రాబతూ ఉంటారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీలంతా ఆర్.కె ప్రశ్నల తాకిడికి ఎన్నో కొత్త విషయాలు బయట పెట్టారు. మరి తాప్సీ ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి సంచలనాలు బయట పెట్టిందో? అనే విషయం ఆసక్తి కరంగా మారింది.

ఇటీవల మంచు మనోజ్, తమిళ నటుడు మహత్ మధ్య గొడవ జరుగడం, మనోజ్ తనపై దాడి చేశాడంటూ హహత్ కేసు వేయడం....తెలిసిందే. ఈ గొడవ చోటు చేసుకోవడానికి తాప్సీనే కారణమని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాప్సీకి, మనోజ్‌కి మధ్య ఎఫైర్ ఉందనే గాసిప్స్ కూడా గుప్పుమన్నాయి. చివరకు తాప్సీ మీడియా ముందుకు వచ్చి మనోజ్ తనకు అన్నయ్య లాంటోడని వివరణ ఇచ్చుకుంది. మరి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఇలాంటి సంచలన విషయాలపై తాప్సీ తన మనసు విప్పిందా? త్వరలో ప్రసారం కానున్న ఆ కార్యక్రమం చూస్తే అర్థమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X