ఆ కోరిక ఇలా తీర్చుకుంటున్నాను: తాప్సీ
హైదరాబాద్: సినిమా రంగంలో హీరోయిన్‌గా సెటిలైన చాలా మందికి చిన్నతనంలో ఉన్న లక్ష్యాలు వేరు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వాళ్లు కొందరైతే...ఇంకేదో అనుకుని చివరకు ఈ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన వారెందరో. హీరోయిన్ తాప్సీ కూడా చిన్నప్పుడు జర్నలిస్టు అవుదామని అనుకుందట.
ప్రస్తుతం అజిత్ హీరోగా తెరకెక్కిన 'ఆరంభం' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది తాప్సి. ఈచిత్రంలో జర్నలిస్టు పాత్రలో నటిస్తున్న తాప్సీ మాట్లాడుతూ....చిన్నతనం నుంచి జర్నలిస్టు అవ్వాలనే కోరిక ఉండేది. ఈ చిత్రంలో ఆ పాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. అందుకే ఆ పాత్రను చాలెజంగా తీసుకుని నటిచానని చెబుతోంది.
ఆరంభం చిత్రంలో అజిత్, ఆర్య, నయనతార లాంటి సీనియర్లు నటించారు. నా పాత్ర కూడా వారితో సమానంగా ఉంటుంది. ఆరంభంలో నా పాత్రకు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉందనే ఆశాభావం వ్యక్తం చేసింది తాప్సి. నిత్యం నృత్యంలో శిక్షణ తీసుకుంటున్నానని, దీని వల్ల ఫిజిక్ మరింత అందంగా తయారవడంతో పాటు మనసు ఉల్లాసంగా ఉంటోందని తాప్సి చెప్పింది.
తెలుగులో ఇప్పటికు వరకు తాప్సీ చాలా సినిమాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం సంపాదించుకోలేక పోయింది. అందం పరంగా, నటన పరంగా మంచి టాలెంటు ఉన్నా ఎందుకో అదృష్టం కలిసి రాలేదు. తమిళంలోనూ తాప్సి పరిస్థితి అలాగే ఉంది. ఆమె నటించిన తొలి చిత్రం 'అడుగుళం' అవార్డులను కొల్లగొట్టినా తాప్సికి మాత్రం కలిసి రాలేదు.


Click it and Unblock the Notifications












