జూలై ఒకటి నా జీవితం మార్చిన రోజు:తాప్సీ
తాప్సీ తన జీవితంలో జూలై ఒకటవ తేదీకి ప్రత్యేక స్దానం ఉందని,దానిని మరవలేనని చెప్పుకొచ్చింది.ఇంతకీ ఏంటా రోజు స్పెషల్ అంటే...ఆమె నవ్వుతూ మర్చిపోయారా..నన్ను మీరు తొలిసారి తెరమీద చూసిన రోజు..అదే..నేను నటించిన తొలి చిత్రం 'ఝుమ్మంది నాదం" విడుదలైన రోజు అంది నవ్వుతూ. అలాగే 'ఝుమ్మంది నాదం"చిత్రం నటిగా నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. తెలుగులో నా స్థాయి పెంచి, నన్ను క్రేజీ హీరోయిన్‌ని చేసింది. ఆ రోజుని నేను ఎప్పుడూ మరచిపోను. ఈ ఏడాది కాలంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వాటి వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలాంటివి తీసుకోకూడదు అనే విషయంపై అవగాహన పెరిగింది. అంతకు ముందుకన్నా ఇప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను అంది. ఇప్పుడు తాప్సీ హిందిలోకి కూడా ప్రవేశిస్తోంది. ఏడాదిలో ఎంత తేడా అంటోంది.


Click it and Unblock the Notifications











