నాకు కావాల్సినంత ప్రేమ దొరికిందంటున్న తాప్సీ
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, మంచు మనోజ్ కుమార్ సరసన ఝుమ్మంది నాదం చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన అందాల బొమ్మ తాప్సీ చిత్రం అట్టర్ ప్లాప్ అయినప్పటికీ తన అందాలతో తెలుగు అభిమానుల మనుసును మాత్రం గెలుచుకుంది. మొదటి చిత్రంతోనే యువత మదిలో గిలిగింతలు పెట్టింది. ఆమె తన నటనతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. దీంతో నిర్మాతలు, దర్శకులు ఆమెను తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
దీంతో తాప్సీ చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. చిత్ర పరిశ్రమలో తనకు కావాల్సినంత ప్రేమ దొరికిందంటోంది ఈ ముద్దుగుమ్మ. తాను ఒకే ఒక సంవత్సరంలో పది సంవత్సరాల అంత ఎత్తుకు ఎదిగాని సంబరపడిపోతూ చెబుతోందంట. అంతేకాదు వచ్చిన కొద్ది రోజుల్లోనే తనకు ఎంతోమంది ఆత్మీయులు చిత్ర పరిశ్రమలో దొరికారని అంటోంది ఈ అందాల బొమ్మ.
tapsi manchu manoj jhummandi naadam k raghavendra rao తాప్సీ మంచు మనోజ్ ఝుమ్మంది నాదం కె రాఘవేంద్రరావు


Click it and Unblock the Notifications