Don't Miss!
- Finance Google Layoffs: ఉద్యోగులను మళ్లీ తగ్గించిన గూగుల్.. భారతీయ టెక్కీలపై భారీ ప్రభావం..
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
'గబ్బర్ సింగ్ కి లైనేసా.. తిక్కని వదిలేసా..': తాప్సీ
హైదరాబాద్: 'గబ్బర్ సింగ్ కి లైనేసా... కొంచెం తిక్కని వదిలేసా... బిజినెస్ మ్యాన్ ని టచ్ చేసా.. మస్తు బిజి అని వదిలేసా ' అంటూ పాడుతోంది తాప్సీ. ఈ పాట షాడో చిత్రంలో తాప్సీ చేస్తున్న ఐటం సాంగ్. గీతా మాధురి హస్కీ వాయిస్ తో ఈ పాట పాడింది. విలన్ ఆదిత్యా పంచోలి ఎదురుగా.. ఈ పాటకు తాప్సీ డాన్స్ చేయనుందని సమాచారం. రాజు సుందరం ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
వెంకటేష్, తాప్సీ జంటగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో పరుచూరి శివరామప్రసాద్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'షాడో'. ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పరుచూరి కిరీటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురించి వెంకటేష్ మాట్లాడుతూ"మంచి టీమ్‌తో చేస్తున్న సినిమా. మెహర్ మంచి ఎనర్జీతో తెరకెక్కిస్తున్నారు. మాస్‌తో పాటు ఫ్యామిలీని ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి' అన్నారు.
దర్శకుడు మెహర్ రమేశ్ మాట్లాడుతూ "అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించాం. వినోదం కలగలసిన యాక్షన్ సినిమా ఇది. మలేషియాలో ఛేజ్ సీన్‌ను వెంకటేష్, శ్రీకాంత్ రిస్క్ తీసుకుని చేశారు. నాగబాబు, ఎమ్మెస్ నారాయణ పాత్రలు మెప్పిస్తాయి. వెంకటేష్‌గారితో పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రాన్ని చేయాలని ఎప్పట్నుంచో అనుకున్నాను. అది ఇప్పటికి నెరవేరింది'' అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ "సినిమా చక్కగా వచ్చింది. ఎడిటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. 'సింహా'ను దాటి పెద్ద చిత్రంగా నిలుస్తుంది. సింగిల్ సిట్టింగ్‌లో వెంకటేష్‌గారు కథను ఓకే చేశారు. ఆయనలోని మాస్ కోణాన్ని చూపించే సినిమా ఇది'' అని తెలిపారు. అలాగే - హై ఓల్టేజ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఇది. వినోదానికి పెద్దపీట వేసి రూపొందించామన్నారు. థమన్ చక్కని సంగీతం అందించారన్నారు. ఇటీవల రిజలైజన టీజర్‌కి ముఖ్యంగా టైటిల్ ట్రాక్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. వెంకటేష్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారన్నారు. ఆయన కెరీర్లోనే ఇది వైవిధ్యమైన చిత్రమన్నారు.
మధురిమ, ఎమ్మెస్ నారాయణ, నాగబాబు, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ధర్మవరపు, ముఖేష్ రుషి, ప్రభు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ:కోన వెంకట్, గోపిమోహన్, మాటలు:కోన వెంకట్, మెహర్ రమేష్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తీ, కెమెరా:ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: థమన్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, హ్యారీ (సిడ్నీ), ఎడిటింగ్:మార్తాండ్.కె, డాన్స్ రాజు, కథనం - దర్శకత్వం: మెహర్ రమేష్.