మోహన్ బాబు కోడలితోనూ డీప్ రిలేషన్...
'ఝుమ్మంది నాదం" సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన తాప్సీ మంచు వారి ఫ్యామిలికే అంకితమైపోయింది. మంచు బ్రదర్స్, ఇద్దరితోను వరుసగా సినిమాలు చేయడమే కాకుండా మంచు లక్ష్మీప్రసన్నకి కూడా 'బెస్ట్" ఫ్రెండ్ అయిపోయింది. ఇద్దరూ కలిసి సినిమాలకీ, షికార్లకీ తెగ తిరిగేస్తుంటారు. కేవలం లక్ష్మీప్రసన్న మాత్రమే కాకుండా మోహన్ బాబు కోడలు విరానికా కూడా తాప్పీకి మంచి స్నేహితురాలయిపోయింది.
ప్రస్తుతం మంచు విష్ణుతో చేస్తున్న సినిమాకి విరానికే నిర్మాత కావడంతో ఆ స్నేహం మరింత ముదిరింది. ఇద్దరి గాఢ స్నేహాన్ని మరింత ముదిరింది. ఈ ఇద్దరి గాఢ స్నేహాన్ని తెలియజేసేలా ఫోటోలు కూడా ఇంటర్నెట్ లోకి వచ్చాయి. వారి మధ్య ఎంతటి బంధం ఉందో తెలుసుకోవాలంటే ఇద్దరినీ ట్విట్టర్ లో ఫాలో అయితీరాల్సిందే. తాప్పీ నిజంగా గ్రేటండోయ్. ఒకేసారి ఇటు మంచువారి హీరోలతో హీరోయిన్ గా, అటు ఆడాళ్లకు స్నేహితురాలిగా డీప్ రిలేషన్ మెయింటైన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











