»   » స్విమ్ సూట్ ల్లో మమ్మల్ని చూడటానికే ధియోటర్స్ కు..తాప్సీ

స్విమ్ సూట్ ల్లో మమ్మల్ని చూడటానికే ధియోటర్స్ కు..తాప్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో, హీరోయిన్స్ పెదవి ముద్దులు చూడటానికో, స్విమ్ సూట్ లో హీరోయిన్స్ అందాలను చూసి ఆనందించటానికో సినిమాలకే రావాల్సిన అవసరం లేదు. సినిమా హీరోయిన్లను సైతం తలపించే రేంజ్‌లో నేటి తరం అమ్మాయిలు దుస్తులు ధరిస్తున్నారు అంటోంది తాప్సీ. ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎక్సపోజింగ్ తప్పదంటూనే అయితే అది చూడ్డానికే జనం ధియోటర్స్ రానవసరం లేదంటోంది. ఆమె మాటల్లోనే ...పార్కులకి వెళితే ప్రేమికుల సరస సల్లాపాలు బోల్డన్ని చూడొచ్చు. కానీ తెరపై హీరో, హీరోయిన్ రొమాన్స్ చేస్తే చూసేవారికి అదో తృప్తి. అందుకే సినిమాల్లో వచ్చే లిప్ లాక్ సీన్స్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కథానుసారం రొమాన్స్ చేయక తప్పదు. ఎక్స్‌ పోజింగ్ చేయకుండా ఇక్కడ కుదరదు అంది. తాప్సీ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్, దశరధ్ కాంబినేషన్ లో రూపొందుతున్నమిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రంలో చేస్తోంది. విష్ణు సరసన వస్తాడు నా రాజు చిత్రంలోనూ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే తమిళంలో ఆడుకలమ్, వందాన్ వెండ్రేన్, మలయాళంలో డబుల్స్ చిత్రంలో కూడా చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu