'ఝమ్మంది నాదం'లో ఎక్సపోజింగ్ గురించి తాప్సీ
మీకు గ్లామర్ కనిపించటానికి, ఎక్సపోజింగ్ కీ తేడా తెలియటం లేదు..ఝమ్మంది నాదం లో నేను గ్లామరస్‌గా కనిపించాను అంతే. దానికే అందరి ప్రశంసలు లభించాయి. అంతేతప్ప ఎక్కడా కూడా ఎక్స్‌పోజింగ్ చేశానన్న కామెంట్ రాలేదు. అలాగే నేను కేవలం గ్లామర్ హీరోయిన్ నే పరిమితం కాదలచుకోలేదు. అందం, అభినయం కలగలిసిన పాత్రలకే నా మొదటి ఓటు. ఇక ఎక్స్‌పోజింగ్ విషయంలో నా పరిమితులు నాకు వున్నాయి అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ. ఆమెను రీసెంట్ గా ఓ మీడియా వారు కదిపితే ఇలా తనకు అస్సలు ఎక్సపోజింగ్ అంటే ఏమిటో తెలియదన్నట్లు ఫోజ్ పెట్టి ఇలా చెప్పింది. ఇక ప్రస్తుతం తాప్సీ ప్రభాస్ సరసన ఓ చిత్రంలోను, రవితేజ సరసన మరో చిత్రంలోను నటిస్తోంది. అలాగే ఈ భామకు తమిళంలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే తమిళంలో ఆమె రెండు సినిమాలను కమిట్ అయ్యింది. ఎక్సపోజింగ్ అంటే ఏమిటో తెలియదు కాబట్టే ఆమె రాణిస్తోంది.


Click it and Unblock the Notifications











