చెప్పేవి శ్రీరంగ నీతులు..చేసేది మాత్రం అంటున్నారు తాప్సీని
నాకు నేను చేసే సినిమాలు చూసేందుకు ఎవరైనా కుటుంబంతో కలిసి రావాలి. అన్నతోనో, నాన్నతోనో కలిసి చూసేందుకు సిగ్గుపడేలా నా పాత్రలు ఉండకూడదు అంటూ గ్లామర్ గురించి క్లాస్ పీకింది తాప్సీ. అంతేగాక నా మటుకు గ్లామర్ అనేది సినిమాకి అవసరమే. అయితే అది పాత్ర డిమాండ్ చేసినప్పుడే అందం. కేవలం గ్లామర్‌కే పరిమితమై పోవడమన్నది సరికాదు అంది. ఇంతలా నీతులు చెప్తున్న ఈ ముద్దుగుమ్మ కేవలం అందాల ప్రదర్శనే జీవితాశయంగా తొలి చిత్రం నుంచి రెచ్చిపోతూ సినిమాల్లో నటిస్తోంది.రీసెంట్ గా రిలీజైన 'వీర'చిత్రంలోనూ ఆమె కొంచెం గట్టిగానే ప్రయత్నించింది.అయితే సినిమా వర్కవుట్ కాకపోవటంతో ఆమెకు పెద్ద పేరు రాలేదు. ఇలా సినిమాల్లో ఎలాంటి పని చేయటానికైనా రెడీ అన్నట్లున్న ఈమె మైక్ ముందు మాత్రం గ్లామర్..అమ్మా నాన్న చూడాలి అంటూ నీతులు చెప్పటం చూసి అంతా బ్రతక నేర్చిన వ్యవహారం అంటున్నారు. ప్రస్తుతం తాప్సీ..గోపీచంద్ సరసన మొగడు చిత్రంలో నటిస్తోంది. కృష్ణవంశీ దర్సకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కృష్ణ వంశీ డైరక్ట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











